అతనితో నా బంధం ఎప్పటికీ నిలిచిపోతుంది ..సమంత ఎమోషనల్

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. సమంత ఇటీవల సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. మయసైటీస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ తరువాత కొలుకున్న సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

samantha emotional about singer chinmayi husband rahul friendship

సమంత ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది . సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తోంది.ఈ వెబ్‌సిరీస్‌లో సమంతతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత స్పై పాత్రలో కనిపిస్తారని సమాచారం. దీంతో పాటు అల్లు అర్జున్ కొత్త సినిమాలో సమంతకు హీరోయిన్‌గా అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నాడు.

samantha emotional about singer chinmayi husband rahul friendship

ఈ సినిమా తరువాత తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ఓ మూవీ చేయడానికి బన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. అట్లీ వినిపించిన కథ నచ్చడంతో వెంటనే సమంత ఈ సినిమాను ఓకే చేసిందని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంత ఫ్రెండ్‌షిప్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా తన సినిమాలకు డబ్బింగ్ చెప్పిన సింగర్ చిన్మయితో సమంత చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంటుంది. తాజాగా చిన్మయి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షోకు గెస్ట్‌గా వెళ్లిన సమంత అక్కడ సందడి చేసింది.

ఈ సందర్భంగా చిన్మయి ఓ గ్రూపు ఫొటోను సమంతకు చూపించడం జరిగింది. ఈ ఫొటోలో సమంత, చిన్మయిలతో పాటు, ఆమె భర్త రాహుల్ ,వెన్నెల కిషోర్ ఉన్నారు. ఈ పిక్ గురించి సమంత మాట్లాడుతూ చిన్మయి భర్త రాహుల్ తన పాత స్నేహితుడని ..నేను అత్యంత ఎక్కువగా నమ్మే వ్యక్తి రాహుల్. ఒకవేళ తాను మర్డర్ చేసినా కూడా తనతో చెప్పేస్తా. ఎందుకంటే అతను నన్ను జడ్జ్ చేయడు. చాలా ట్రూగా ఉంటాడు. ఆయనతో నా బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X