సీఎం విజయ్‌పై సమంత ఎమోషనల్ పోస్ట్.. ఆ రోజే అనుకున్న అంటూ..

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె నటించి, నిర్మించిన 'మా ఇంటి బంగారం'సినిమా జూన్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తమిళంలో 'ఎంగల్ తంగం' పేరుతో విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా చెన్నై వెళ్లిన సమంత, అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?

'మా ఇంటి బంగారం' విడుదలకు ముందు సమంత జోరుగా ప్రమోషన్లు చేస్తుంది. ఒకే రోజులో దాదాపు 40కి పైగా మీడియా, డిజిటల్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం పూర్తి చేసిన ఆమె, ఇప్పుడు తమిళనాడులో కూడా దూకుడు పెంచారు. ఈ క్రమంలో సీఎం విజయ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ భేటీ సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Samantha Emotional Post on Tamil Nadu CM Vijay Goes Viral Ahead of Maa Inti Bangaaram Release

సమంత సోషల్ మీడియా వేదికగా సీఎం విజయ్ పై ప్రశంసలు కురిపించింది. 'ఈరోజు చెన్నైలో అడుగుపెట్టగానే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి విజయ్ ని కలవబోతున్నాను. విజయ్ సర్ కేవలం తెరపై హీరోగా మాత్రమే ఉండటానికి పుట్టిన వ్యక్తి కాదని నాకు ఎప్పటినుంచో అనిపించేది. ఆయనలోని శక్తి, ప్రజలు ఆయనకు ఇచ్చే స్పందన, ఆయన ప్రభావం చూస్తుంటే ఉన్నత లక్ష్యం కోసం పుట్టిన వ్యక్తిగా కనిపించేవారు' అంటూ సమంత తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే సినీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న ఒక వ్యక్తి, ఆ స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి పూర్తిగా కొత్త రంగంలో అడుగుపెట్టడం చిన్న విషయం కాదని సమంత అభిప్రాయపడ్డారు.

'మీరు ఇప్పటికే సాధించిన రంగాన్ని వదిలి, మరింత పెద్ద బాధ్యతలు, సవాళ్లు ఉన్న మార్గాన్ని ఎంచుకోవడం అంటే ఎంతో ధైర్యం కావాలి. అది సులభం కాబట్టి కాదు, సమాజంలో మార్పు తీసుకురాగలమనే నమ్మకం వల్లనే సాధ్యమైంది'అని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా 'మన జీవితంలో ఏదో ఒక దశలో మన కోసం మాత్రమే కాదు, సమాజం కోసం కూడా ఏదైనా చేయాలనే పిలుపు వస్తుంది. కానీ ఆ పిలుపుకు స్పందించే వారు చాలా తక్కువ మంది. విజయ్ సర్ ఆ పిలుపుకు స్పందించిన వారిలో ఒకరు'అని సమంత పేర్కొన్నారు.

'విజయ్ సర్ ఇప్పటికే ఆయనను నమ్ముతున్న వారినే ఆశ్చర్యపరుస్తారని నాకు అనిపిస్తోంది. ఆయన గొప్పతనం ఆయన పదవిలో లేదు. ఆ పదవిని ఎలా ఉపయోగించాలన్న సంకల్పంలో ఉంది. ఆయనకు సామర్థ్యం , వివేకం, సరైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను'అని రాసుకొచ్చారు. సమంత తన పోస్ట్ చివర్లో 'జీవితం మనం మొదట కలగన్న కలల కంటే చాలా పెద్దదిగా మారవచ్చు. విజయ్ సర్ ప్రయాణం అందుకు ఒక ఉదాహరణ'అని పేర్కొన్నారు.

విజయ్-సమంత కాంబినేషన్‌కు తమిళ సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. కత్తి, అదిరింది, పోలీసోడు (తెరి) వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ లో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించడమే కాకుండా, ప్రేక్షకుల హృదయాల్లో కూడా ప్రత్యేక స్థానం సంపాదించాయి. ప్రస్తుతం సమంత పోస్ట్‌ వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X