For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha : చైతూ విడాకుల త‌ర్వాత తొలి సారి నోరు విప్పిన స‌మంత‌.. వారిని అభ్యర్థిస్తా అంటూ!

  |

  నాగ చైతన్యతో నాలుగేళ్ల వివాహబంధాన్ని ముగించుకుని త్వరలో సమంత విడాకులు తీసుకోనుంది. అయితే ఈ జంట స‌డెన్‌గా విడాకులు ప్రకటన చేసినప్పటి నుంచే అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పటిదాకా ఈ విషయం మీద నేరుగా స్పందించని సమంత ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో అంతా ఓపెన్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే

  సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్ గా

  సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్ గా

  అక్టోబర్ 2న నాగ చైతన్య- సమంత విడిపోతున్న‌ట్టు ప్రకటించారు. అయితే విడిపోవడానికి కారణాలు మాత్రం చెప్పలేదు. స‌మంత నాగ చైత‌న్య‌ విడాకుల ప్రకటన తర్వాత ఓ నెలంతా వీరి విడాకుల అంశంపైనే సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే నాగ చైతన్యతో డైవర్స్ అనంతరం సమంత సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది.

  అబార్షన్లు కూడా

  అబార్షన్లు కూడా

  ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత తాను ఎదుర్కొన్న ఎడతెగని ట్రోలింగ్ గురించి ఆమె నోరు విప్పింది. అలాంటి వారి నుంచి తాను ఏం ఆశిస్తున్నానో కూడా వెల్లడించింది. అక్టోబర్ 2న సమంత, నాగ చైతన్య భార్యాభర్తలుగా విడిపోయామని ప్రకటించినప్పటి నుంచి చాలా మంది ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అబార్షన్లు కూడా జరిగాయని ఆరోపణలు వినిపించాయి.

  ELLE మ్యాగజైన్

  ELLE మ్యాగజైన్

  అయితే, సమంత ఒక బలమైన ప్రకటనతో పుకార్లకు బ్రేక్ వేసే ప్రయత్నం చేసింది., అయినా సమంతను దారుణంగా టార్గెట్ చేసి ట్రోల్ చేయడంతో ఆమె కోర్టులో కేసులు కూడా వేసింది. ఇక ఇటీవల సమంత ELLE మ్యాగజైన్ కవర్‌పై కనిపించింది. వారితో ఒక ఇంటర్వ్యూలో, ఆమె ఒక ముఖ్యమైన జీవిత నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తాను ఎదుర్కోన్న కనికరంలేని ట్రోలింగ్ గురించి మాట్లాడింది.

  వారిని అభ్యర్థిస్తా

  వారిని అభ్యర్థిస్తా

  ఆమె, "నేను షరతులు లేని అంగీకారాన్ని డిమాండ్ చేయను. నేను విభిన్న అభిప్రాయాలను కలిగి ఉండమని ప్రజలను ప్రోత్సహిస్తాను, అయితే మనం ఇప్పటికీ ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు మరియు కరుణించవచ్చు. వారి నిరాశను మరింత నాగరికంగా వ్యక్తం చేయమని మాత్రమే నేను వారిని అభ్యర్థిస్తాను." అని ఆమె చెప్పింది

  భరణం

  భరణం

  విడిపోయారని ప్రకటించిన తర్వాత, సమంత మరియు నాగ చైతన్య పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఇక నివేదికల ప్రకారం, సమంతా నాగచైతన్య తన కుటుంబం నుండి రూ 200 కోట్ల భరణం అందించారు . నటి దానిని అంగీకరించడానికి నిరాకరించింది మరియు వారి నుండి తనకు పైసా అక్కర్లేదని చెప్పింది.

  Pushpa Trailer Delay | Samantha As Yashodha || Filmibeat Telugu
  యశోదగా మారి

  యశోదగా మారి

  సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి 'యశోద' టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్‌కు, త‌గ్గ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న వవ సినిమాకు ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. సమంతతో పాటు సినిమాలో నటించే ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

  English summary
  Samantha finally reacts to trolling after split with Naga Chaitanya
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X