Samantha: సమంత ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనట. సామ్ రోజూ ఏం తింటుందో తెలుసా?

Samantha: సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు. ఆ తార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా, నార్త్ ప్రేక్షకులలో కూడా ఆమె విపరీతమైన క్రేజ్ తో దూసుకెళ్తుంది. ఇప్పుడు 'మా ఇంటి బంగారం'అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ తరుణంలో ఈ అమ్మడుకి సంబంధించిన పలు వ్యక్తిగత విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ మాత్రం వయసు పెరిగేకొద్దీ తన అందం, ఫిజిక్‌తో అందర్నీ ఆకర్షిస్తుంది. దీని వెనక ఆమె డైట్ ప్లాన్ ఏంటో? ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? మీరు కూడా ఓ లూక్కేయండి.

సాధారణంగా సినీ సెలబ్రెటీలు బ్యూటీ, ఫిట్‌నెస్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. స్పెషల్ డైట్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లు అందంగా కనిపించడం కోసం డైట్ చేస్తారనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మాత్రం తన డైట్‌ను అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం పాటిస్తుందట. మయోసైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధి బారినపడిన తర్వాత ఆమె తన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు చేసుకుందట.

Samantha Fitness Secret Revealed Anti-Inflammatory Diet No Cheat Meals amp amp Workout Plan

సమంత ప్రస్తుతం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ (Anti-Inflammatory Diet)ను పాటిస్తుందట. ఒకప్పుడు ఏది కావాలంటే అది తినేదానంట, కానీ, బరువు పెరుగుదల సమస్యగా మారకూడదని సమంత భావిస్తుందట. అయితే మయోసైటిస్ నిర్ధారణ తర్వాత తన శరీరం వచ్చిన మార్పులకు అనుగుణంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌ను ఎంచుకున్నట్లు సమంత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం తాను తీసుకునే ఆహారం దాదాపు ప్రతిరోజూ ఒకేలా ఉంటుందని, చీట్ మీల్స్ అనే కాన్సెప్ట్ తన జీవితంలో లేదని స్పష్టం చేసింది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ అంటే ఏమిటి?
శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (మంట, వాపు) పెరగడం అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్, ఆర్థరైటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌తో సంబంధం కలిగి ఉంటాయి. అందుకే సమంత తన డైట్‌లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే ఆహారాలను మాత్రమే చేర్చుకుంది. అంటే సమంత డైట్ లో బ్రోకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు ప్రధానంగా ఉంటాయి. వీటిలో ఉండే సల్ఫోరాఫేన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

సమంత రోజూ తీసుకునే ప్రత్యేక ఆహారాలు
సెలరీ, బెర్రీలు, అకాయి బెర్రీలు, అల్లం వంటి ఆహార పదార్థాలు సమంత డైట్‌లో ముఖ్యమైనవి. ఇవి శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా అల్లంలో ఉండే జింజరాల్ ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇక మొలకలు, నెయ్యి , కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా ఆమె ఆహారంలో భాగం. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచకుండా శరీరానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక పాలకూర (Spinach),కేల్ (Kale)వంటి ఆహారాలను సమంత చాలా దూరమట.

ప్రోటీన్‌పై ప్రత్యేక దృష్టి
సమంత తన ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకుంటుంది. అవసరమైతే సప్లిమెంట్స్ కూడా తీసుకుంటుంది. ప్రోటీన్ కేవలం కండరాల పెరుగుదలకు మాత్రమే కాదు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడటం, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. చాలా మంది సెలబ్రిటీలు వారానికి ఒకరోజు చీట్ మీల్ తీసుకుంటారు. కానీ సమంత మాత్రం ఆ కాన్సెప్ట్‌ను పూర్తిగా విరుద్దం.

వర్కౌట్స్ కూడా అంతే కఠినం
డైట్‌తో పాటు సమంత ఫిట్‌నెస్‌కు మరో ప్రధాన కారణం వర్కౌట్స్. ఈ విషయంలో ఆమె చాలా క్రమశిక్షణతో ఉంటుందట. ఆమె చేసే వ్యాయామాల్లో వెయిట్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ప్లాంక్స్, పుష్‌అప్స్, లంజెస్, స్ట్రెచింగ్ వంటి ఉంటాయి. ఈ వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తుందట. ఆమె వర్కౌట్ వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం సమంత డైట్ ప్లాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X