Samantha Divorce : 200 కోట్ల భరణం.. నాగచైతన్యకు షాకిస్తూ కీలక నిర్ణయం!

సమంత- నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గా నడుస్తోంది. అక్టోబర్ రెండో తేదీ సాయంత్రం వారు ఇద్దరూ విడిపోతున్నట్లుగా తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. మరో వారం రోజుల్లో వారి వివాహం జరిగి నాలుగేళ్లు పూర్తి కావస్తున్న ఈ సమయంలో వారిద్దరూ విడిపోతున్నట్లుగా ప్రకటన చేయడంతో ఒకపక్క అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా షాక్ కి గురయ్యారు. అయితే సమంత భరణం గురించి ఇప్పుడు ఆసక్తికరమైన వార్తలు బయటికి వస్తున్నాయి.. ఆ వివరాల్లోకి వెళితే

లెక్క ప్రకారం ఇవ్వాలి కానీ?

లెక్క ప్రకారం ఇవ్వాలి కానీ?

సాధారణంగా భారతీయ చట్టాల ప్రకారం భార్య భర్త విడాకులు తీసుకున్న సమయంలో భర్త నుంచి భార్యకు భరణం గా కొంత మొత్తం వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తున్నా, ఇద్దరికీ ఆదాయ మార్గాలు ఉన్నా సరే భార్య కనుక కోరితే భర్త ఖచ్చితంగా భరణం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో నాగ చైతన్య అలాగే ఆయన కుటుంబం మొత్తానికి కూడా సమంత షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సమంత నాగచైతన్య విడిపోతున్న తరుణంలో మ్యూచువల్

సమంత నాగచైతన్య విడిపోతున్న తరుణంలో మ్యూచువల్

డైవర్స్ కోసం సమంత కు దాదాపు 200 కోట్ల రూపాయలను భరణంగా ఇచ్చేందుకు నాగచైతన్య ఆయన కుటుంబం సిద్ధమైనట్లు తెలుస్తోంది.. అయితే అందుకు సమంత ససేమిరా అన్నట్లు సమాచారం.. ఇద్దరూ అంగీకారంతోనే విడి పోతున్నాము కాబట్టి తనకు ఎలాంటి భరణం చెల్లించాల్సిన అవసరం లేదని సమంత నాగ చైతన్య ఆయన కుటుంబానికి తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇది ఇప్పటికే వీరు విడాకులకు సంబంధించిన వ్యవహారం కౌన్సిలింగ్ స్టేజ్ దాటిపోయింది అని తెలుస్తోంది.

నాకేమీ వద్దంటూ

నాకేమీ వద్దంటూ

నిజానికి ఈ భరణం గురించి సమంత దగ్గర ప్రస్తావించినప్పుడు మొదట ఆమె ఏమీ మాట్లాడలేదు అయితే కొంత ఆలోచన తర్వాత తాను ఒక్క రూపాయి కూడా తీసుకోవాలని అనుకోవడం లేదని చైతూ కుటుంబానికి తేల్చి చెప్పిందట. తాను కూడా సినిమాల్లో నటిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నా కాబట్టి తనకు ఎలాంటి భరణం అక్కర లేదని ఆమె తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సమంతను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో భరణం కూడా తీసుకొని ఉంటే మరింత ఆమెను నెగిటివ్ గా ట్రోల్ చేసేవారు. అయితే ఇప్పుడు ట్రోలర్స్ కు అవకాశం తప్పినట్లే.

ఇప్పుడు కష్టమే కానీ

ఇప్పుడు కష్టమే కానీ

ఇక సమంత సన్నిహితుల నుంచి అందిన సమాచారం మేరకు ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసిన సమంత ప్రస్తుతం పని మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సమంత బాధతో ఏ పనీ సరిగా చేయలేక పోతుందని, ఈ పరిస్థితుల్లో ఆమె పని చేయడం కూడా కరెక్ట్ కాదు కానీ తనకు కోట్ల రూపాయల మేర రెమ్యూనరేషన్ ఇచ్చి ఇంత స్థాయికి తీసుకు వచ్చిన సినిమా ఇండస్ట్రీకి, నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతోనే ఆమె తన పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Naga Chaitanya Samantha Divorce, ఆమెపై దుష్ప్రచారం వద్దు | #ChaySam || Filmibeat Telugu
అలా మొదలైంది

అలా మొదలైంది

నాగచైతన్య లాల్ సింగ్ చద్దా షూటింగ్ కోసం లఢక్ కి వెళ్ళిన తర్వాత వీరిద్దరి బంధానికి బీటలు వారాయి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారం కొనసాగుతున్న క్రమంలోనే సమంత తన సోషల్ మీడియా ఖాతాలతో నుంచి అక్కినేని అనే పదం తొలగించి కేవలం దానికే పరిమితం అయింది. అయితే అది ఆమె నటిస్తున్న శాకుంతలం సినిమా కోసం అని అప్పట్లో కవర్ చేసినా సరే చివరికి ఈ వ్యవహారం ఇంత దాకా వచ్చింది. విడాకులు ప్రకటన తర్వాత ఎస్ అనే పదాన్ని మళ్లీ మార్చి ఆమె సమంత అని చేసుకోవడం గమనార్హం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X