సమంతకు రాజ్ నిడిమోరు కోట్ల విలువైన గిఫ్టులు.. రేర్ డైమండ్ రింగ్, ఇంటి విలువ ఎన్ని కోట్లంటే?
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు సీక్రెట్ మ్యారేజ్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. గత కొద్దికాలంగా ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి డేటింగ్ చేస్తున్నారనే వార్తలు జాతీయ మీడియాలోను, సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై ఎలాంటి కామెంట్స్ చేయకపోవడంతో వారి బంధం ఫ్రెండ్‌షిప్‌ను మించి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ డిసెంబర్ 1వ తేదీన గుట్టు చప్పుడు కాకుండా ఇషా యోగా ఫౌండేషన్‌లో వివాహం చేసుకోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. అయితే సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి తర్వాత కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్ ఇచ్చిన బహుమతుల వివరాల్లోకి వెళితే..
జాతీయ మీడియా కథనాల విషయానికి వస్తే.. సమంత తన వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో ఆమెకు అండగా నిలిచాడు. చైతూతో విడాకుల సమయంలోను, అలాగే ఆమె అరుదైన వ్యాధికి గురైన సమయంలో రాజ్ అండగా నిలవడమే కాకుండా మనోధైర్యాన్ని ఇచ్చాడు. ది ఫ్యామిలీ మ్యాన్ షూటింగులో జరిగిన పరిచయం కాస్త సిటాడెల్ సినిమా షూటింగ్ టైమ్‌లో ప్రేమగా మారింది అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

రాజ్ నిడిమోరు తన మొదటి వివాహానికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించుకొని సమంతతో రిలేషన్‌షిప్‌ను పక్కాగా చేసుకొన్నారు. తమ పెళ్లికి ముందే సొంత ఇల్లు కోసం భారీగా ఖర్చు చేశారు. పెళ్లి తర్వాత కాపురం ఉండటానికి జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన బంగ్లాను రాజ్ నిర్మించాడు. పెళ్లి తర్వాత ఆమెకు ఇంటి తాళాలు అప్పగించి అపురూపమైన బహుమతిగా అందజేశారు. ఈ ఇంటి విలువ భారీగానే ఉంటుంది అని ఏషియానెట్ న్యూస్ తన కథనంలో వెల్లడించింది.
సమంత, రాజ్ తమ బంధాన్ని పక్కాగా చేసుకొన్న తర్వాత రెండు నెలల క్రితమే నిశ్చితార్థం జరుపుకొన్నారు. తనకు కాబోయే భార్య కోసం రాజ్ అరుదైన డైమండ్ ఉంగరాన్ని ఎంగేజ్‌మెంట్ రోజున వేలికి తొడిగారు. రేర్ డైమండ్స్‌తో కూడిన రింగ్‌ను ఆమెకు బహుకరించాడు. లోజెంజ్ కట్ డైమండ్ రింగ్. ఇప్పటి వరకు ఇలాంటి ఉంగరాన్ని ఏ హీరోయిన్ కూడా ధరించలేదు. ఈ రింగ్ విలువ సుమారుగా 1.5 కోట్ల రూపాయలు ఉంటుంది అని డైమండ్ ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇలా సమంతకు అరుదైన గిఫ్టులు బహుకరించి తన మనసును రాజ్ గెలుచుకొన్నాడు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, అభిమానాలకు ఈ బహుమతులు సూచిక అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం సమంతకు బహుకరించిన ఇల్లు, ఎంగేజ్‌మెంట్ రింగ్ ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి విషయానికి వస్తే.. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో ఇరు కుటుంబాల సభ్యులు వివాహం ఇషా యోగా సెంటర్‌లోని లింగ్ భైరవి ఆలయంలో జరిగింది. డిసెంబర్ 1 తేదీ ఉదయం సమంత మెడలో రాజ్ మూడు మూళ్లు వేశాడు. ఇషా ఫౌండేషన్‌లో భూతశుద్ది క్రతువు ద్వారా సమంత, రాజ్ నిడిమోరు కొత్త జీవితాన్ని ఆరంభించారు. ఇషా యోగా ఫౌండేషన్‌లో కొన్నేళ్లుగా కొనసాగుతున్న వివాహ పద్దతి భూతశుద్ది. భారతీయ సంప్రదాయ విధానంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. బంధాల, వైవాహిక బంధాలకు ఉండే దోషాలను ముందే తొలగించి.. గాఢమైన అనుబంధాన్ని దంపతుల మధ్య ఏర్పరిచే ఓ ట్రెడిషినల్ మ్యారేజ్ సిస్టమ్‌గా పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











