సమంతకు పూనమ్ కౌర్‌కు ఎక్కడ చెడింది? సోషల్ మీడియాలో ట్వీట్ వార్
తెలుగు సినిమా ప్రముఖులపై సోషల్ మీడియాలో నటి పూనమ్ కౌర్ యుద్ధం ప్రకటించింది. గత కొన్ని సంవత్సరాలుగా తనకు అన్యాయం జరిగింది. కొందరు తన జీవితంతో ఆడుకొన్నారు. నా ప్రాణాలను పణంగా పెట్టేంతగా మోసం చేశారు అనే ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటి వరకు తన అసంతృప్తిని ఒకరిద్దరు సినీ ప్రముఖులపైనే వెళ్లగక్కారు. అయితే తాజాగా ఇప్పుడు ఆమె వ్యతిరేకత సమంతపై కూడా పడటం సినిమా ఇండస్ట్రీలోను సోషల్ మీడియాలోను ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. అయితే సమంతతో ఏదైనా వైరం ఉందా? లేదా అనుష్కపై ఉన్న అభిమానం కొద్ది అలాంటి కామెంట్స్ చేసిందా? అనేది ఇప్పుడు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకు సమంతను ఉద్దేశించి పూన్ కౌర్ చేసిన పరోక్ష కామెంట్స్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..
సౌత్ సూపర్ స్టార్ సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ఆమె నటన, యాక్షన్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నిరాజనాలు మాత్రమే కాకుండా ఆమె సినిమాపై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సక్సెస్‌ను రకరకాలుగా సోషల్ మీడియాలో అభిమానులు అభివర్ణిస్తున్నారు. అయితే నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా సక్సెస్ తర్వాత సమంత టాలీవుడ్‌లో అతిపెద్ద లేడీ సూపర్ స్టార్ అయిందా? అనే చర్చ మొదలైంది.

సమంత స్టార్ స్టామినాను దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఓ పోస్టు పెట్టాడు. తెలుగు సినిమా పరిశ్రమలో సమంత బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్ అయిందా? అంటూ ప్రశ్న వేశారు. అందుకు కొందరు సమంత కూడా లేడి సూపర్ స్టార్ అయ్యారు అని అంటే.. మరికొందరు అంత సీన్ లేదు.. ఇప్పటికే నయనతార, అనుష్క శెట్టి వరుసగా విజయాలు సొంతం చేసుకొంటున్నారు అని కామెంట్ చేశారు. అయితే ఈ ముగ్గురు కాదు.. ఎప్పటికైనా విజయశాంతి లేడి సూపర్ స్టార్ అంటూ కొత్త వాదనను కొందరు తెరపైకి తెచ్చారు.
ఇలాంటి వాదనలు సోషల్ మీడియాలో కొనసాగుతుండగా.. పూనమ్ కౌర్ సెన్సేషనల్ పోస్టు పెట్టారు. అనుష్క శెట్టిని ఎవరు కూడా అధిగమించలేరు. ఒకవేళ ఎవరైనా అలా అనుకొంటే.. అవి కలలుగానే మిగిలిపోతారు అంటూ కామెంట్ చేశారు. అయితే ఆమె కామెంట్స్ కొందరు నెటిజన్లు జవాబిస్తూ.. అనుష్కకు ఇప్పడంత క్రేజ్ లేదు. ఇప్పుడు సాయిపల్లవికి మాత్రమే ఆ ట్యాగ్ ఉంది. ఒక సినిమాను పుల్ చేసే కెపాసిటీ, నటిగా ఆమెకు ప్రత్యేకమైన గౌరవం ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే సమంతను పూనమ్ కౌర్ నిజంగానే టార్గెట్ చేసిందా? లేక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందా? అనే రెండు విషయాలపై వాదనలు ఊపందుకొన్నాయి. వాస్తవానికి సమంతతో పూనమ్‌కు పెద్దగా వైరం గానీ, అభిప్రాయ బేధాలు ఉన్నట్టు ఎన్నడూ కనిపించలేదు. కాబట్టి యధాలాపంగాను ఆమె కామెంట్ చేసి ఉంటారు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications