నాగ చైతన్యను మోసం చేయడంపై స్పందించిన సమంత.. అది మంచిది కాదంటూ!
సినీ రంగంలో సెలెబ్రిటీల మధ్య లవ్ ట్రాకులు సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమాయణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది జంటలుగా మారారు. అలాంటి వారిలో సమంత రూత్ ప్రభు, అక్కినేని నాగ చైతన్య జోడీ ఒకటి. వీళ్లిద్దరూ చాలా కాలం ప్రేమించుకుని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత విడిపోయారు. అప్పటి నుంచి వీళ్ల విడాకులపై ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సమంత.. నాగ చైతన్యను మోసం చేయడంపై స్పందించింది. ఆ వివరాలు మీకోసమే!
లవ్ మ్యారేజ్‌తో ఎంజాయ్:అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు జంటగా 'ఏమాయ చేశావే' సినిమా చేశారు. అప్పుడే మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. 'ఆటోనగర్ సూర్య' సినిమా చేసిన టైమ్‌లో లవ్‌లో పడిపోయారు. అప్పటి నుంచి ఎన్నో ఏళ్ల పాటు సీక్రెట్‌గా ట్రాక్‌ను నడిపించారు. ఆ తర్వాత సమంత, నాగ చైతన్య వివాహం బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఎంజాయ్ చేశారు.

బ్రేకప్ చెప్పుకున్న జంట:వివాహం తర్వాత తమదైన రీతిలో చిల్ అవుతూ బెస్ట్ కపుల్ అనిపించుకున్న నాగ చైతన్య - సమంత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు. తద్వారా తమ వివాహ బంధానికి పుల్‌స్టాప్ పెట్టారు. ఈ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోతున్నామని వెల్లడించారు.
విడాకులపై క్లారిటీ లేదు:నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుని ఎన్నో ఏళ్లు గడుస్తున్నా.. అసలు వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు? ఏ విషయాల్లో ఈ జంట మధ్యన మనస్పర్థలు వచ్చాయి? అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అయ్యాయి. దీంతో చాలా మంది ఎవరికి తోచిన విధంగా వాళ్లు చెప్పుకుంటూ దీన్ని హైలైట్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇది మిస్టరీగానే ఉండిపోయిన సంగతి తెలిసిందే.

అతడిదే, ఆమెదే తప్పు:సమంత రూత్ ప్రభు, నాగ చైతన్య విడాకులు వ్యవహారంపై ఇంకా ఎవరికీ ఎలాంటి క్లారిటీ రావడం లేదు. దీంతో ఎవరి అభిమానులు వాళ్లను సపోర్ట్ చేసుకుంటూ ఎదుటి వాళ్లను బ్లేమ్ చేస్తున్నారు. దీంతో ఈ అంశం వల్ల చాలా మంది సోషల్ మీడియాలో గొడవలు కూడా పెట్టుకుంటున్నారు. అందుకే ఇది జరిగి చాలా కాలమే అవుతున్నా ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతోంది.
ఎందుకు మోసం చేశావ్:అటు నాగ చైతన్యకు, ఇటు సమంత రూత్ ప్రభుకు తమ విడాకుల గురించి ఎన్నో సందర్భాల్లో రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. అయినప్పటికీ వీళ్లు నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో సమంత ఓ వీడియో పెట్టగా.. దానికింద ఓ ఔత్సాహిక నెటిజన్ 'అమాయకుడైన నాగ చైతన్యను నువ్వు ఎందుకు మోసం చేశావు' అని సూటిగా ప్రశ్నించాడు.

అది మంచిది కాదంటూ:సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు స్పందించింది. 'నన్ను ఈ ప్రశ్న అడగడం మీకు మంచిది కాకపోవచ్చు. దీనిపై మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి. ఏది ఏమైనా మీరు బాగుపడాలి అని కోరుకుంటున్నాను' అంటూ తెలివిగా సమాధానం చెప్పింది. మొత్తానికి మరోసారి సమంత తన విడాకులకు కారణం మాత్రం దాటవేసింది.


Click it and Unblock the Notifications











