మంచితనాన్ని చేతకానితనం అనుకోవద్దు.. ప్రతీదానికి ఎక్స్‌పైరీ డేట్.. సమంత స్ట్రాంగ్ వార్నింగ్​

అక్కినేని సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల బాధ నుంచి బయటకు రావడం కోసం ఆమె వరుస సినిమాలను లైన్ లో పెట్టి ఎప్పటికప్పుడు బిజీగా ఉంటూ సినిమాలు చేస్తూ ముందుకు వెళుతోంది. ఒకానొక సమయంలో నాగచైతన్య అభిమానులు ఆమె మీద విరుచుకుపడినా సంయమనం కోల్పోకుండా ఆమె సైలెంట్ గా వ్యవహరించింది. కానీ ఇప్పుడు అనూహ్య రీతిలో ఆమె వార్నింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

తట్టుకోలేక

తట్టుకోలేక

అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత ఆ తర్వాత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.. ఈ విడాకుల ప్రకటన వచ్చినప్పటి నుంచి సమంత వైపే తప్పు ఉందని నాగచైతన్య చాలా మంచోడు అని రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. కొంతమంది అసలు వీళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కూడా రకరకాల ప్రచారాలు చేస్తూ చిలువలు పలువలు చేస్తూ రకరకాల కథనాలు పుట్టిస్తూ ఉండడంతో తట్టుకోలేక సమంత కోర్టుకు వెళ్లింది.

సోషల్ మీడియా వేదికగా

సోషల్ మీడియా వేదికగా

ఆ సమయంలో కోర్టు కూడా సమంతకు ఒకపక్క అండగా నిలబడుతూనే మరోపక్క ఇలాంటి పర్సనల్ విషయాలు బహిర్గతం చేయడం వల్ల రకరకాలుగా మాటలు పడాల్సి వస్తుందని ఇకమీదట చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమెకు కూడా సూచనలు చేసింది. అయితే సమంత కోర్టు సూచనలు ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు, ఎందుకంటే తనకు మనసులో ఏమనిపించిందో దాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరచడానికి ఆమె ఆసక్తి చూపిస్తూ ఉంటుంది

వార్నింగ్

వార్నింగ్

తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన కొన్ని వార్నింగ్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆమె 'నా మౌనాన్ని పట్టించుకోవడం లేదని తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను సైలెంట్ గా ఉన్నాను అంటే దాన్ని నేను ఒప్పుకున్నాను అని అర్థం కాదు, జాలిగుణం నా వీక్నెస్, అయితే ఆ జాలి గుణానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అంటూ ఆమె ఎవరికో ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వార్నింగ్ ఇచ్చింది అనే విషయం మీద అయితే క్లారిటీ లేదు.

 సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

విడాకుల ప్రకటన తర్వాత సమంత తెలుగులో శాకుంతలం అనే సినిమా షూటింగ్ పూర్తి చేయగా ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో నటించింది. మరోపక్క నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నయనతారతో కలిసి సమంత ఒక సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

వరుస ఆఫర్లు

వరుస ఆఫర్లు

ఇది కాకుండా సమంత యశోద అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోపక్క ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో కూడా భాగమైంది. దానికి తోడు విజయ్ దేవరకొండ శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా ఎంపికైంది.. అలాగే ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి వాటిని ఆమె ఫైనల్ చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X