మ్యారేజ్ డే సందర్భంగా చైతుకి సమంత ఇచ్చే గిఫ్ట్ ఇదే!
సమంత, నాగ చైతన్యకు ఈ వినాయక చవితి ప్రత్యేకంగా మిగిలిపోనుంది. సమంత నటించిన యూ టర్న్, సీమ రాజా చిత్రాలు రేపు విడుదల కాబోతున్నాయి. నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం కూడా రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.
అక్టోబర్ 6 సమంత, చైతు జీవితంలో మరచిపోలేని రోజు. ఆరోజు వారి తోలి మ్యారేజ్ డే జరగబోతోంది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. అక్టోబర్ 6న నేను, చైతు కలసి నటించబోయే చిత్రం ప్రారంభం కానుంది. చైతుకి నేను అందించే మ్యారేజ్ డే గిఫ్ట్ అదే అని సమంత తెలిపింది.

ఇదిలా ఉండగా శైలజారెడ్డి అల్లుడు, యూ టర్న్ రెండు చిత్రాలపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. శైలజారెడ్డి అల్లుడు చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూ టర్న్ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది.


Click it and Unblock the Notifications











