4 ఏళ్ల నుంచి అతడితో సమంత రిలేషన్?.. చైతూ విషయంలో ప్రూవ్ చేయగలరా?

సినీ రంగానికి సంబంధించి పలువురు ప్రముఖ పర్శనల్ విషయాలు బహిర్గతం కానంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఒక్క పోజ్ అయితే మాత్రం నెటిజన్స్ లో అవే హాట్ టాపిక్ గా వినిపిస్తూ ఉంటాయి. కాగా హీరో హీరోయిన్స్ విషయంలో కొన్ని పుకార్లు ఎక్కువగా ఒకప్పుడు బాలీవుడ్ సినిమా నుంచి వినిపించేవి. కానీ ఇప్పుడు మన తెలుగు సినిమా నుంచి కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి.

అలా గత కొన్నేళ్ల కితం టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటగా అక్కినేని యువ హీరో నాగ చైతన్య అలాగే స్టేర్ బ్యూటీ సమంతలు విడాకులు తీసుకున్న వార్త చాలా మంది హృదయాలు ముక్కలు చేసింది. ఈ తర్వాత ఇక ఇద్దరిపై రెండు వెర్షన్ లు స్టార్ట్ అయ్యాయి. కాగా ఈ లిస్ట్ లో సమంత కి సపోర్ట్ గా కొంతమంది చైతూకి సపోర్ట్ గా కొంతమంది విడిపోయారు.

samantha have relationship with him for 4 years who is he

ఇక్కడ నుంచి చాలా కారణాలు వినిపిస్తూ వచ్చాయి. ఇద్దరు సెపరేట్ అయ్యి ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. కాగా జస్ట్ కొన్ని రోజులు కితం తన జీవిత కొత్త భాగస్వామి అంటూ ప్రముఖ నటి శోభిత ధూళిపాళని అక్కినేని కుటుంబం అనౌన్స్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. దీనితో మళ్ళీ చైతు, సమంతల ఫ్యాన్స్ నడుమ గొడవ మొదలైంది. అయితే సామ్ ఫ్యాన్స్ కొందరు శోభిత వల్లనే చైతు సమంత విడిపోయారు అని సామ్ తో పెళ్ళైన తర్వాత కూడా నాగ చైతన్య శోభిత ధూళిపాళతో రిలేషన్ షిప్ మైంటైన్ చేసాడు అని పలు ఆరోపణలు చేస్తున్నారు.

కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే చైతు కాదు సమంత నాలుగేళ్ల పాటు ఒకతినితో రిలేషన్ షిప్ మైంటైన్ చేసింది అంటూ కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. అతడు మరెవరో కాదు సమంతకి పర్శనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అయునటువంటి ప్రీతం జుకల్కేర్ అట. ఇతడు చాలా సార్లు సామ్ ని ఉద్దేశించి తన లవ్ అంటూ, ఐ లవ్ యు అంటూ పోస్ట్ కామెంట్స్ స్టోరీస్ కూడా పెట్టిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి.

samantha have relationship with him for 4 years who is he

ఇది చాలదా సమంతకి ఇతనికి ఉన్న బంధం ఏంటి అని చెప్పడానికి ఇంకా సమంత కూడా ఇతడికి సోషల్ మీడియాలో లవ్ రియాక్షన్స్ తో పోస్ట్ లు.. ఇన్స్టాలో ఒకరి కోసం ఒకరు స్టోరీస్ కూడ పెట్టుకోవడం జరిగింది. కానీ అంతా ఆరోపిస్తున్నట్టుగా నాగ చైతన్య, శోభితలు రిలేషన్ లో ఉన్నట్టుగా ఒక్క పోస్ట్ కానీ ఒక్క ఫోటో కానీ ఒక్క కామెంట్స్ కానీ ఎవరైనా చూపించాలని చై అభిమానులు అంటున్నారు.

సో నాగ చైతన్య శోభిత విషయంలో రూమర్స్ అన్ని ఒట్టి అబద్దాలు అని వారు అంటున్నారు. మొత్తానికి అయితే మళ్ళీ సామ్, చైతు అభిమానులు యుద్ధం సోషల్ మీడియాలో ఊపందుకొని కొనసాగుతుంది అని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే సమంత నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఇంకా చైతుపై రాలేదు.. ఇక వీరి మేటర్ ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X