'నందిని' నువ్వు నా ఆత్మవిశ్వాసం.. 2012 సంగతి చెబుతూ సమంత ఎమోషనల్
అన్ని రంగాల్లో స్నేహాలు అనేవి చాలా కామన్. అయితే సినీ పరిశ్రమలో ఉన్నవారికి మాత్రం చలో తక్కువ మందితో స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా స్టార్ హీరోయిన్ సమంత సన్నిహితులు ఎవరు అని ప్రశ్నిస్తే మొదటగా వినిపించే పేరు నందినిరెడ్డి. గురువారం నాడు నందిని రెడ్డి పుట్టినరోజు కావడంతో సమంత ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లడించింది. ఆ మేరకు ఒక ఎమోషనల్ నోట్ కూడా ఆమె షేర్ చేసుకుంది. ఆ వివరాలు

మనోధైర్యం ఇచ్చి
సమంత మరియు నందిని రెడ్డి మంచి స్నేహితులు అనే విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. వీరిద్దరు కలిసి సినిమాలు కాకుండా ఆహా సామ్-జామ్ షో వంటి పలు జాయింట్ వెంచర్లు కూడా చేశారు. ఇక సమంత ఇటీవల విడాకులు తీసుకున్న సమయంలో కూడా నందిని రెడ్డి స్నేహితురాలిగా ఆమెకు చాలా మనోధైర్యం ఇచ్చింది.
సుదీర్ఘ నోట్
శుక్రవారం నాడు నందిని రెడ్డి పుట్టినరోజు కావడంతో బర్త్ డేను గుర్తుండిపోయేలా సమంత తన మనసులోని భావాలను షేర్ చేసుకుంది. తనలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి నందిని ఎలా సాయ పడిందో, ఏ విధంగా అండగా నిలిచారో చెబుతూ ఒక పెద్ద నోట్ షేర్ చేసుకుంది. ఆమె పంచుకున్న సుదీర్ఘ నోట్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

సినిమాల విషయానికి వస్తే
"నా ప్రియమైన స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ మంచితనమే మీ గొప్పతనం. మీరు నాకు స్ఫూర్తినిస్తారు! నాకు అది ఎప్పటిలాగే గుర్తుంటుంది. 2012 లో నేను బాగానే ఉన్నప్పటికీ, ఎందుకో నాలో ఆత్మవిశ్వాసం తక్కువయింది. దీంతో షూటింగ్స్, ఇతర పనులు చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేది. కానీ నీ పరిచయంతో ఎక్కడా లేని ఆత్మవిశ్వాసం వచ్చింది. నీ సలహాలను ఎప్పటికీ మరిచిపోలేను'' అంటూ నందినితో ఉన్న ఫోటో షేర్ చేసింది సమంత.

సినిమాల విషయానికి వస్తే
సమంత చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'తో ఆమె బాలీవుడ్ లోనూ మంచి మార్కెట్‌ని ఏర్పర్చుకుంది. అప్పటికే సౌత్ లో సూపర్ స్టార్ గా మారిన సమంత ఈ వెబ్ సిరీస్‌తో అన్ని బాషలలో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం సమంత సౌత్‌తో పాటు హిందీలో సినిమాలకు కమిట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది.
Recommended Video

విడుదలకు సిద్దంగా
మరో వైపు అనూహ్యంగా సమంత ఒక ఇంటర్నెషనల్ ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేసింది. దీంతో సమంత పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్‌ని దాటేయబోతుందని చెప్పక తప్పదు. సమంత ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన `పుష్ప` చిత్రంలో `ఊ అంటావా మావ.. ఊఊ అంటావా` పాటలో డాన్స్ చేసి ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపింది. మరో పక్క ఆమె హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. అంతేకాక యశోద అనే సినిమాలో కూడా ఆమె నటిస్తోంది.


Click it and Unblock the Notifications











