twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాటూని చూపించేందుకే వెరైటీ పోజా?.. వైరలవుతోన్న సమంత పిక్స్

    |

    సెలెబ్రిటీల్లో కొందరికీ టాటూల పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. టాలీవుడ్‌లోనూ ఆ కల్చర్ ఎక్కువగానే విస్తరిస్తోంది. సినిమాల కోసం తాత్కాలికమైన టాటూలను కొందరు వేసుకుంటే.. శాశ్వతంగా ఉండే టాటూలను మరికొందరు వేసుకుంటారు. ఈ టాటూలను తన ఎద భాగంలో వేసుకుని అందరి మతి పోగోట్టింది త్రిష. అప్పట్లో అది పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. నీమో ఫిష్‌ను టాటూగా వేసుకున్న త్రిష.. కొంతకాలం సీక్రెట్‌గా మెయింటెన్ చేసినా అది వర్కౌట్ కాలేదు. అయితే టాటూలనేవీ ప్రస్తుత కాలంలో సర్వసాధారణమయ్యాయి.

    చైసామ్‌ల టాటూ..

    చైసామ్‌ల టాటూ..

    టాటూలు అంటే టాలీవుడ్‌కు ముందుగా గుర్తుకు వచ్చేది సమంత-నాగ చైతన్యలే. వారి చేతిపై వేయించుకున్న టాటూ గురించి ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. వాటికి అర్థమేంటని ఎన్నో రకాలుగా ఎందరో ప్రశ్నించగా.. చివరకు దాని కథను వివరించారు. తనకు, తన భర్తకు గుర్తుగా వేయించుకున్నదని, మేమిద్దరం అని, రియాలిటీలో ఉందామన్న అర్థమే.. ఈ టాటూ వెనకుందని సీక్రెట్ బయట పెట్టేసింది.

    సీక్రెట్ ప్లేస్‌లోనూ మరో టాటూ..

    సీక్రెట్ ప్లేస్‌లోనూ మరో టాటూ..

    ఎద భాగానికి కింద.. నడుము భాగానికి పైన వేయించుకున్న ఈ టాటూ అప్పట్లో ఓ సారి బయటకు కనిపించింది. అయితే అలా బయటకు కనిపించాక సోషల్ మీడియా వేదికగా దాని అర్థాన్ని సమంతే నేరుగా చెప్పేసింది. ఇప్పటి వరకూ రహస్యంగా కనబడకుండా దాచిన టాటూ బయటకు కనిపించింద అంటూ అది చైతు పేరేనంటూ చెప్పేసింది.

    తాజా పోజులు వైరల్..

    తాజా పోజులు వైరల్..

    తాజాగా జీ సినీ అవార్డ్స్ 2020 వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో సమంత మెరిసింది. సూపర్ డీలక్స్ చిత్రానికి గానూ ఓ అవార్డును కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుకలో వేసుకున్న డ్రెస్, తీసుకున్న ఫోటో షూట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    మరోసారి టాటూపై చర్చ..

    మరోసారి టాటూపై చర్చ..

    అయితే ఈ సారి సమంత టాటూ మళ్లీ స్పష్టంగా కనబడింది... కనబడేలా కావాలనే పోజు ఇచ్చిందో తెలీదు కానీ, సోషల్ మీడియాలో మళ్లీ చర్చ లేవనెత్తింది. సమంత పోజులు నెటిజన్లకు పిచ్చెక్కిపోతోంది. ఆ టాటూ అర్థం తెలియని వారు..అది భర్త పేరా? అని అమాయకంగా అడిగేస్తున్నారు. అయితే సమంతను నిత్యం ఫాలో అయ్యే వారికి ఆ విషయం ఎప్పుడో తెలిసే ఉంటుంది. స‌మంత ప్రస్తుతం 96, ఫ్యామిలీమ్యాన్ -2 అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది.

    English summary
    Samantha Hidden Tattoo Is Displayed Publicly. She Attended ZeeCineAward 2020. In That Event She Did Photoshoot. Those Pics Goes Viral On Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X