సమంత పారితోషకం రెండింతలు... జడుసుకున్న డైరెక్టర్... మొదలవ్వని షూటింగ్
అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టినా సినీ కెరీర్ కు బ్రేకులు పడకుండా జాగ్రత్త పడుతన్న సమంత, ఇప్పుడు ఆచి తూచి అడుగువేస్తోంది. అంతేకాదు, ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్న స్ట్రాటజీని బాగా ఫాలో అయ్యే సామ్... హీరోయిన్ గా తనకు డిమాండ్ ఉన్నప్పుడే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలని తాపత్రయపడుతోంది.
లాక్ డౌన్ ముగిసి ఇక పెండింగ్ షూటింగ్ లకు తెర లేస్తుండటంతో, సమంత కూడా సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం అమ్మడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతితో కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్న సామ్, మరోవైపు గేమ్ ఓవర్ ఫేమ్ అశ్వన్ శరవణన్ డైరెక్షన్ లోనూ ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అయితే లాక్ డౌన్ పూర్తవుతూనే అశ్విన్ సినిమానే పట్టాలెక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అనుకోని విధంగా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతోంది. దీనికి కారణం సమంత సడన్ గా పారితోషకాన్ని రెండింతలు చేసేయడమేనని వినిపిస్తోంది. సాధారణంగా సినిమాకు కోటిన్నర నుంచి రెండు కోట్లు తీసుకుంటుంది సమంత. అయితే అశ్విన్ చిత్రానికి అమ్మడు ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేస్తోందట. అయితే, ఇక్కడ అమ్మడు డిమాండ్ కూ ఓ కారణం ఉందని తెలుస్తోంది.
ఈ సినిమా రెండు భాషల్లో తెరకెక్కుతుండటంతో, రెండు వర్షెన్ లకూ కలిపి అమ్మడు ఈ మొత్తాన్ని అడుగుతోందట. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన్న ఒకే సినిమాను పలు భాషల్లో విడుదల చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటోన్న దర్శక-నిర్మాతలకు అమ్మడి వ్యవహారం కాస్త షాకింగ్ గానే ఉంటుంది. కానీ, సమంత ఆలోచన లోనూ పాయింట్ ఉంది. మరి ఈ వ్యవహారం ఎప్పటికి తెగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











