సమంత హానీమూన్ ఫోటోలు ట్రెండింగ్.. రాజ్‌తో కలిసి వెకేషన్ ఏ దేశంలో అంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుతు ప్రభు.. ప్రత్యేక పరిచయం అవసరం లేని ఈ అమ్మడు.. తాజాగా తన లైఫ్ లోని మోస్ట్ బ్యూటీపుల్ అండ్ హ్యాపీ మూమెంట్స్‌ను తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సమంత తన పెళ్లి అనంతరం వర్క్ కమిట్‌మెంట్స్‌తో బిజీగా తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే.. తాజాగా కొంత గ్యాప్ దొరకడంతో భర్త రాజ్ తో కలిసి హానీమూన్ కు వెళ్లింది. ఇంతకీ వీరిద్దరూ ఎక్కడి వెళ్లారు?

హీరోయిన్ సమంత గతేడాది డిసెంబర్ ప్రారంభంలో రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా వినిపించిన రూమర్స్‌కు తెరదించుతూ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలసి, కొత్త జీవితం ప్రారంభించారు. కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో, లింగ భైరవి సన్నిధిలో వీరి పెళ్లి జరిగింది. వీరి వివాహ వేడుక అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. పెళ్లి అనంతరం సమంత సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసి, తన పెళ్లి ప్రకటనను స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే..

Samantha Honeymoon Vacation photos Trending Her foreign trip after marriage with Raj Nidimoru pics

పెళ్లి తరువాత సమంత సోషల్ మీడియాకు కాస్త రూపంగా ఉంటుంది. కానీ, తాజాగా సమంత తన భర్తతో కలిసి పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో హనీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడ గడుపుతున్న మధుర క్షణాలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

సమంత షేర్ చేసిన తాజా ఫోటోల్లో లిస్బన్ నగరపు అందాలు, అక్కడి చారిత్రక కట్టడాలు, వీధులు, క్రిస్మస్ పండుగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫాతిమాలోని 'బెసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది రోసరీ', ప్రసిద్ 'మాన్యుమెంట్ టు ది డిస్కవరీస్', 'ఆర్కో డా రువా అగస్టా'వంటి ప్రదేశాలను ఈ జంట సందర్శించినట్లు ఫోటోలు చెబుతున్నాయి. వింటర్ వేర్‌లో సమంత వివిధ లుక్స్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. పింక్ బీనీ క్యాప్‌లో ఆమె లుక్ ప్రత్యేకంగా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

సమంత ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. 'డిసెంబర్ ఇలా గడిచిపోతోంది' అంటూ క్యాప్షన్ పెట్టింది. ఫోటోల్లో సమంత చాలా హ్యాపీగా కనిపిస్తోంది. ఒక ఫోటోలో రాజ్ నిడిమోరు చేతిలో డోనట్ పట్టుకుని ఉండగా, సమంత సరదాగా గడుపుతున్న క్షణాలు.. మరికొన్ని ఫోటోల్లో ఈ జంట ఇద్దరూ రిలాక్స్‌డ్‌గా, సంతోషంగా కనిపిస్తున్నారు.

సమంత గతంలో నాగచైతన్యతో వివాహబంధంలోకి వెళ్లి, నాలుగేళ్ల తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఒంటరిగా గడిపిన సమంత, తన కెరీర్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టింది. అదే సమయంలో ఆమె 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో ప్రొఫెషనల్‌గా దగ్గరైంది. రాజ్‌కు గతంలో రచయిత్రి శ్యామోలితో వివాహం కాగా, ఆ బంధం విడాకులతో ముగిసినట్లు తెలుస్తోంది. ఇరువురికీ వ్యక్తిగత జీవితంలో చేదు అనుభవాలు ఉండటంతో, ఆ అనుభవాలే వారిని మరింత దగ్గర చేశాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

సమంత - రాజ్ లు కలసి, 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి భారీ ప్రాజెక్టుల్లో కలిసి పనిచేశారు.ప్రస్తుతం 'రక్త బ్రహ్మాండ్: ద బ్లడీ కింగ్‌డమ్' అనే ప్రతిష్టాత్మక ఓటీటీ సిరీస్‌లో మరోసారి కలిసి పని చేస్తోంది. సమంత నిర్మిస్తున్న సినిమాల్లో రాజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. మొత్తానికి.. వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన సమంత, ప్రస్తుతం లిస్బన్‌లో భర్త రాజ్ నిడిమోరుతో కలిసి హనీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X