అది కచ్చితంగా చూపించాలి.. సమంత సంచలన నిర్ణయం.. షాక్‌లో ఫ్యాన్స్
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్‌లో ఉంది. ఇప్పటికే దాదాపు 50 రోజుల పాటు దేశ ప్రజలంతా క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు అంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. క్షణ కాలం తీరిక లేకుండా గడిపే స్టార్స్ ప్రస్తుంతం ఇంటి పట్టునే ఉంటూ ఫ్యామిలీతో సరదాగా గడిపేస్తున్నారు. అయితే కొంతమంది తమలోని ప్రతిభను మరింత మెరుగు పరుచుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

ప్రతిభకు మెరుగులు..
లాక్ డౌన్‌లో ఉన్న సెలెబ్రిటీలందరూ తమ ప్రతిభకు పదును పెడుతున్నారు. కొంతమంది ఆన్‌లైన్ క్లాసులు అంటే, మరికొంత మంది వంటింట్లో చిట్కాలు అంటున్నారు. ఇంకొంత మంది ఇంట్లోనే వ్యాయామాలు అంటే మరొకొందరు పెయింటింగ్స్, డ్రాయింగ్స్, కొత్త కొత్త ఛాలెంజ్‌లంటూ బిజీగా ఉన్నారు.

గ్యాప్ ఇచ్చిన సమంత..
క్వారంటైన్ మొదలైనప్పటి నుంచి సమంత సోషల్ మీడియాలోకి అంతగా రాలేదు. సమంతను చాలా మిస్ అవుతున్నామని నెటిజన్లు తెగ వాపోయారు. ఈ క్రమంలో కాస్త గ్యాప్‌తో వచ్చిన సమంత.. భర్త ఫోటోను షేర్ చేసింది. తన కుక్క పిల్లతో ఎంజాయ్ చేస్తూ ఉన్న చైతన్య ఫోటోను షేర్ చేసి మళ్లీ అందర్నీ ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయింది.

బిజీబిజీగా ఉన్న సమంత..
ఒకప్పటిలా నిత్యం ఏదో ఒక పోస్ట్ చేయడం లేదు సమంత. సమయం, సందర్భం చూసి పరిమిత సంఖ్యలో పోస్ట్‌లు చేస్తుంది. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ మరణ వార్తలపై మాత్రమే స్పందించిన సమంత.. చాలా కామ్‌గా ఉంటోంది. తాజాగా సమంత చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
Recommended Video

అలా జరగకపోతే..
ప్రస్తుతం తారలంతా ఇంటి పట్టున ఉంటూ మెళుకువలు నేర్చుకుంటూ ఉండగా.. సమంత తన నటనకు మెరుగులు దిద్దుతూ ఉంది. ఈ మేరకు పోస్ట్ చేస్తూ.. ‘1000 గంటల్లో ఒక్క గంటనైనా చక్కగా ఉపయోగించుకున్నప్పుడు అది కచ్చితంగా చూపించాల్సిందే. మీరు చూస్తూ ఉండండి.. నేనింకా బెటర్ యాక్టర్‌ని అవబోతోన్నాను. ఒకవేళ కాలేదనుకోండి.. అప్పుడు ఈ పోస్ట్‌ని డిలిట్ చేస్తాన'ని ఓ తెలిపింది. ఇక సమంత పోస్ట్ చూసిన ఫ్యాన్స్.. ఎలాంటి సినిమాలు రాబోతాయో, ఎలా కనబడుతుందోనని షాక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











