Samantha Instagram హ్యాక్ అయ్యిందా.. హఠాత్తుగా పొలిటీషియన్ ఫొటో.. ఏం జరిగిందంటే?

సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో స్టార్ సెలబ్రెటీలకు ఎంతో ప్రత్యేకమైనది. జనాలకు సెలబ్రిటీలకు ఒకప్పుడు ఉన్న గ్యాప్ ను ప్రస్తుతం సోషల్ మీడియా అనేది కనెక్ట్ చేస్తోంది అని చెప్పవచ్చు. ఫ్యాన్స్ ను ఎక్కువగా ఆకట్టుకునే విధంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా హ్యాక్ అవుతూ ఉండడం విశేషం. రీసెంట్ గా సమంత ఇన్స్టాగ్రామ్ కూడా హ్యాక్ అయినట్లు అభిమానులు సందేహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక పొలిటిషన్ ఫోటో కూడా హఠాత్తుగా ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ అయింది. ఇక వెంటనే సమంత టీం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

Samantha instagram hacked news viral and clarification update

టాప్ సెలబ్రెటీగా..

టాప్ సెలబ్రెటీగా..

సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ అందుకున్న స్టార్ సెలబ్రిటీలలో సమంత సౌత్ ఇండస్ట్రీలో టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అత్యధిక ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్స్ లలో ఆమె ఒకరు. సమంత ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా ఈజీగా ట్రెండింగ్ లిస్టులో చేరిపోతుంది.

 భారీ సంఖ్యలో ఫాలోవర్స్

భారీ సంఖ్యలో ఫాలోవర్స్

సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానుల సంఖ్యను కూడా అంతకంత పెంచుకుంటుంది అనే చెప్పాలి. గడిచిన రెండు మూడు నెలల్లోనే ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా 24.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అందులో చాలామంది రీసెంట్ గానే సమంత ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు.

గ్లామరస్ ఫొటోస్

గ్లామరస్ ఫొటోస్

సాధారణంగా సమంత రెగ్యులర్ గా తన ఇన్స్టాగ్రామ్ లో ఏదో ఒక ఫోటోను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా గ్లామరస్ అందాలతో ఆమె ఇటీవల కాలంలో ఎవరు ఊహించని విధంగా దర్శనమిస్తోంది. ఆ మధ్య ఒక ప్రత్యేకమైన ఫోటోషూట్ లో బికినీలో కూడా కనిపించిన విషయం తెలిసిందే.

 హ్యాక్ అయినట్లు..?

హ్యాక్ అయినట్లు..?

అయితే రీసెంట్ గా సమంతకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అభిమానులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె ఇన్స్టాగ్రామ్ లో సంబంధం లేకుండా కొన్ని పోస్టులు కనిపించడం అలాగే ప్రముఖ రాజకీయ నాయకుల ఫోటో కూడా కనిపించడంతో ఎందుకు ఇంత హఠాత్తుగా సమంత అల పోస్ట్ చేసింది అని కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. బహుశా ఎకౌంట్ హ్యాక్ అయి ఉండవచ్చు అని కూడా చాలా రకాల కథనాలు విలువడ్డాయి.

అసలు ఏమైందంటే?

ఇక వెంటనే సమంత తన టీమ్ మెంబర్స్ తో క్లారిటీ ఇప్పించేసింది. అయితే సమంత అకౌంట్ హ్యాక్ కాలేదు అని అది కేవలం టెక్నికల్ గ్లిచ్ కారణంగానే అలా జరిగినట్లుగా వివరణ ఇచ్చారు. ఇక వెంటనే ఆ విషయంపై చర్యలు తీసుకుని మళ్లీ టీమ్ ను ఎలార్ట్ చేసినట్లుగా కూడా మరో ఇన్స్టా పోస్ట్ లో వివరణ ఇవ్వడంతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చినట్లయ్యింది. పలు సందర్భాల్లో సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్ మెయింటైన్ చేసే టీం నుంచి కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X