Samantha: ఆ విషయంలో తొందర పడుతున్న సమంత.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?
ప్రెజెంట్ సౌత్ నుంచి నార్త్ వరకు వెళ్లి పాగా వేసిన హీరోయిన్స్ ఒకొక్కరిగా ఎక్కువ అవుతున్నారని చెప్పవచ్చు. మెయిన్ గా ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పాన్ ఇండియా లెవెల్లో హవా చూపిస్తుంది. కాగా ఇపుడు రష్మిక హవా నడుస్తుంది కానీ తన కంటే ముందే పాన్ ఇండియా ఆడియెన్స్ ని రీచ్ అయ్యిన బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా స్టార్ బ్యూటీ సమంత అనే చెప్పాలి.
కాగా సమంత విడాకులు తర్వాత తనకి ప్రొఫిషినల్ గా ఎలా ఉన్నా కూడా పర్శనల్ లైఫ్ మాత్రం అంత సాఫీగా సాగలేదు అని చెప్పాలి. థియేటర్స్, ఓటిటీలో తాను వరుస హిట్స్ అందుకుంది కానీ పర్శనల్ గా మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ పక్క మానసికంగా మాత్రమే కాకుండా శారీరికంగా కూడా సమంత ఎదురు దెబ్బలు తీసుకోవాల్సి వచ్చింది.

ఇలా తెలుగు సినిమాకి కూడా చాలా కాలం తాను దూరం అయ్యిపోయింది. కాగా మధ్య మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఆమెపై కొన్ని సెటైర్స్ ఆమెపై వేశారు. మా తెలుగు సినిమాలు మళ్ళీ చేయవా అన్నట్టు చేసిన కామెంట్స్ ఆమె విషయంలో మంచి వైరల్ గా మారాయి. కాగా సమంత ఇపుడు ఫుల్ ఫోకస్ అంతా హిందీ ఇండస్ట్రీ లోనే పెట్టుకుంది.
ఇటీవల చేసిన వెబ్ సిరీస్ సిటాడెల్ తో పలకరించింది. దీని తర్వాత మరో భారీ సిరీస్ అది కూడా తుంబాడ్ లాంటి సినిమా దర్శకుడు అనీల్ రాహి బర్వెతో రక్త బ్రహ్మాండ్ అనే సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది కానీ ఇపుడు తెలుగు సినిమా విషయంలో కూడా ఆమె తొందర పడాలని చూస్తున్నట్టుగా పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

కాగా తెలుగులో ఎలాంటి కొత్త సినిమా ఆమె ఓకే చెయ్యలేదు కానీ ఆమె చేయాల్సి ఉన్న ఓ సినిమా ఎపుడు నుంచో పూర్తి కావాల్సి ఉంది. మరి ఈ చిత్రాన్ని ఇపుడు సమంత కంప్లీట్ చేసేందుకు మళ్ళీ తెలుగు సినిమాలోకి వస్తుందట. కాగా దీనికి కూడా ఇంకో బలమైన కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా సమంత చేస్తుండడంతో ఇప్పటికే లేట్ అయ్యింది అని ఇక త్వరపడాలని చూస్తుందట.
కాగా ఆ చిత్రమే "మా ఇంటి బంగారం". ఎలాంటి హీరో లేకుండా కేవలం హీరోయిన్ బ్యాక్ డ్రాప్ లోనే మేకర్స్ ఈ సినిమాని అనౌన్స్ చేసారు. సో తెలుగులో తన సినిమా కాబట్టి సామ్ వచ్చి కంప్లీట్ చేయాలని చూస్తుందట. ఇక ఈ సినిమా మినహాయిస్తే తెలుగులో మరో సినిమా చేసేందుకు అంత ఆసక్తిగా లేదనే వినిపిస్తుంది. సో సామ్ త్వరలోనే మళ్ళీ తెలుగులో సందడి చేయొచ్చని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు లాంటివి ప్రస్తుతం గోప్యంగా ఉన్నాయి. ఇవన్నీ ముందు ముందు రివీల్ కానున్నాయి.


Click it and Unblock the Notifications











