సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ బర్త్ డే గిఫ్ట్ ఇదేనా? సమంతకు నెటిజన్ల తింగరి ప్రశ్న
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో తాజాగా చేసిన ఓ పోస్ట్ ఆమె సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ గురించి కొత్త చర్చకు దారి తీసింది. ఇంతకీ సమంత చేసిన ఆ పోస్ట్ లో ఏముంది అనే విషయంపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.
ఏప్రిల్ 28న సమంత పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే సామ్ తన 37వ పుట్టిన రోజును స్నేహితులతో కలిసి గ్రీస్ దేశంలో జరుపుకుంది. గ్రీస్ రాజధాని అయిన ఏథెన్స్ లో సమంత తాను తిరిగిన అందమైన ప్రదేశాలు, పుట్టిన రోజుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, తాజాగా సామ్ మరో ఫోటోను షేర్ చేయగా, నిమిషాల వ్యవధిలోనే అది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సమంత ఇన్స్టా స్టోరీస్ లో ఒక ఫోటోను షేర్ చేసింది.
అందులో రోజ్ గోల్డ్ చైన్ ధరించి కనిపించింది. ఆ చైన్ కి కన్ను గుర్తుతో ఉన్న డాలర్ ఉండడం విశేషం. దాన్ని స్పెషల్ గా హైలెట్ చేస్తూ సమంత దిగిన ఫోటో కొత్త అనుమానాలకు తెర తీసింది. ఆ ఫోటోని చూసిన ఫ్యాన్స్ నీ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ దీన్ని బర్త్ డేకి గిఫ్ట్ గా ఇచ్చారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా సమంత నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకొని, ఆ తర్వాత కొంతకాలానికే డివోర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సమంత గురించి ఎలాంటి వార్త బయటకు వచ్చినా వెంటనే వైరల్ అయిపోతుంది.
ఇక ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే విషయంపై క్యూరియాసిటీ నెలకొంది. అందుకే సమంత క్రిప్టిక్ గా ఏ పోస్ట్ చేసినా వెంటనే బాయ్ ఫ్రెండ్ గురించే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక తన మాజీ భర్తతో విడిపోయిన తర్వాత సినిమాలపై పూర్తిగా ఫోకస్ చేసింది ఈ అమ్మడు. అయితే మధ్యలో మయాసైటిస్ కారణంగా ఇబ్బందులకు గురైన సమంత ఆ తర్వాత సినిమాలను కొంత కాలం పక్కన పెట్టి ప్రత్యేకంగా దానికి చికిత్స తీసుకోవడానికి వెళ్ళిపోయింది.

ఓ వైపు చికిత్స, మరోవైపు ప్రకృతితో మమేకం అవుతూ దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ అప్పుడు కూడా సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగానే ఉంది. రీసెంట్ గా కోలుకున్న సామ్ రీ ఎంట్రీకి రెడీగా ఉంది .
ఇప్పటికే తన పుట్టినరోజు కానుకగా మా ఇంటి బంగారం అనే సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఈ బ్యూటీ. మా ఇంటి బంగారం మూవీ సమంత సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతోంది. మరోవైపు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడేల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











