టాలీవుడ్‌లో హీరోయిన్లపై లైంగిక దాడులు.. సంచలనంగా మారిన సమంత లేటెస్ట్ పోస్ట్
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా చాలా మంది హీరోయిన్లు స్టార్లుగా మారిపోయారు. అలాంటి వారిలో సమంత రూత్ ప్రభు ఒకరు. చాలా తక్కువ సమయంలో తనదైన అందం, అభినయంతో మెప్పించిన ఈ భామ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటింది. తద్వారా బడా హీరోయిన్‌గా మారి హవాను చూపిస్తోంది. అయితే, ఇప్పుడు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. సామాజిక అంశాలపై ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత ఓ వివాదంపై పోస్ట్ చేసింది. ఇంతకీ ఏంటది? ఆ పూర్తి వివరాలు మీకోసమే!
సినిమాలకు గ్యాప్ ఇచ్చేసి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చాలా రోజులుగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపించే ఈ జబ్బు నుంచి కోలుకునేందుకు ఈ భామ కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. ఇప్పుడు కూడా దీనివల్లే సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సమంత కోలుకోవడానికి తీవ్రంగా కష్టపడుతోంది.

కేరళలో హేమ కమిటీపైన
కేరళ ప్రభుత్వం ఇటీవలే సినిమా నటీమణుల కోసం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మలయాళ సినీ రంగానికి చెందిన ఎంతో మంది నటీమణులు బయటకు వచ్చి చాలా మంది ప్రముఖులపై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇది దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఇప్పుడు దీనిపై సమంత రూత్ ప్రభు పోస్ట్ చేసింది.
స్వాగతిస్తున్నాము అంటూ
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత రూత్ ప్రభు.. జస్టిస్ హేమ కమిటీపై స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టా పోస్టులో 'తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. దీనికి మార్గం వేసిన కేరళ డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) యొక్క నిరంతర ప్రయత్నాలను అభినందిస్తున్నాము' అంటూ చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ వారికోసం కూడా
అదే పోస్టులో సమంత రూత్ ప్రభు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా జస్టిస్ హేమ తరహాలో కమిటీని తీసుకు రావాలని కోరింది. ఈ మేరకు '2019లో తీసుకు వచ్చిన సపోర్ట్ గ్రూప్ అయిన 'ది వాయిస్ ఆఫ్ ఉమెన్' కూడా తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల కోసం ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ గ్రూప్ స్ఫూర్తిగా తీసుకోవాలి అని కోరుకుంటున్నా' అంటూ వివరించింది.

తెలంగాణ ప్రభుత్వంపై
సమంత రూత్ ప్రభు ఆ తర్వాత కంటిన్యూ చేస్తూ.. 'టాలీవుడ్‌లో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము' అంటూ వెల్లడించింది. తద్వారా సమంత టాలీవుడ్‌లో కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. దీంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











