Samantha కూతుర్ని అలా పెంచండి.. పెళ్లి విషయంలో అలా చేస్తే .. సమంత షాకింగ్ పోస్ట్!

నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుండి స‌మంత ఎక్కువగా వార్త‌ల‌లో నిలుస్తూ వస్తోంది. ఆమె చేస్తున్న పోస్టులు అన్నీ కూడా తాను బాధ పడుతున్నట్లు ఉండడంతో ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియా వేదికగా హైలైట్ అవుతూ వస్తోంది. తాజాగా ఆమె చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

విడాకుల కారణంగా

విడాకుల కారణంగా

గత కొద్ది రోజుల నుంచి సమంత విడాకుల కారణంగా ఇబ్బందులు పడుతోంది. దానికి కారణం ఈ విడాకులకు సమంతనే అసలు రీజన్ అని చెబుతూ పలు యూట్యూబ్ ఛానెల్స్ పెద్ద ఎత్తున గాసిప్స్ ప్రసారం చేయడమే గాక, అభ్యంతరకరమైన థంబ్‌నెయిల్స్ కూడా పెట్టి రచ్చ చేశాయి. ఈ క్రమంలోనే తన పరువు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత కోర్టుకెక్కడం సంచలనంగా మారింది.

కోర్టు సంచలన తీర్పు

కోర్టు సంచలన తీర్పు

తాజాగా ఈ కేసుపై కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సమంతకు ఊరటనిస్తూ ఆమె వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీళ్లేదని, చెబుతూ యూట్యూబ్‌ ఛానెల్స్‌ వెంటనే అలాంటి కంటెంట్‌ మొత్తం కూడా తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇంజెక్షన్ ఆర్డర్‌ కూడా పాస్ చేసింది. అంతే కాక సోష‌ల్ మీడియాలో సమంత కూడా ఏది పడితే అది పెట్టకూడదని పేర్కొంది.

ఆసక్తికర పోస్ట్

ఆసక్తికర పోస్ట్

అయితే చాలా యాక్టివ్‌గా ఉండే స‌మంత అప్పుడ‌ప్పుడు ప‌లు ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెడుతూ హాట్ టాపిక్‌గా మారుతుంది.మై మమ్మీ సెడ్ అనే హ్యాష్‏ట్యాగ్‏తో ప్రస్తుతం తను ఎదుర్కోంటున్న మానసిక సంఘర్షణ మొత్తాన్ని ఆమె బయట పెట్టే ప్రయత్నం చేస్తోంది. గత కొద్దిరోజులుగా సమంత తన ఇన్‏స్టాలో పలు ఆసక్తికర పోస్టులు చేస్తూ వస్తుంది.

ఇక ఈ మధ్యనే తన స్నేహితురాలితో కలిసి ఛార్‏ధామ్ యాత్ర చేసి వచ్చిన సమంత, అక్కడ ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవన్నీ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా యాత్ర ముగించిన తర్వాత.. సామ్.. పెయింటింగ్స్ వేస్తున్న ఫోటోలు షేర్ చేసుకుంది. అలాగే తన ఇన్‏స్టా స్టోరీస్ లో మరో ఆసక్తికర పోస్ట్ చేసింది.

ఎదుర్కొనేలా తయారు చేయండి

ఎదుర్కొనేలా తయారు చేయండి

ఆ పోస్ట్ లో 'మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారని కంగారు పడకుండా తనని సమర్థంగా తీర్చిదిద్దండి, ఆమె పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు తన చదువు కోసం ఖర్చు పెట్టండి. ఆమెను పెళ్లికి సిద్ధం చేసే ముందు తన కోసం తనని సిద్ధం చేయడం అంతకంటే ముఖ్యం. అలాగే తనను తాను ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండటం నేర్పించండి, అలాగే ఇతరులకు అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్ధం చేయండి' అలా ఆమె అవసరం అయినప్పుడు ఎవరినైనా ఎదుర్కొనేలా తయారు చేయండి అనే ఒక ఫోటోను షేర్‌ చేసింది.

బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్‌

బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్‌

సమంత బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్‌ ఎంజాయ్ చేస్తో ఫోటోలు మరియు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి నాగ చైతన్యతో కలిసి ఉన్న దాదాపు 85 చిత్రాలు తొలగించినట్లు తేలింది. దాదాపు వారు కలిసి ఉన్న చాలా చిత్రాలు తొలగించబడ్డాయి. బహుశా సమంత తన రిలేషన్ జ్ఞాపకాలు శాశ్వతంగా చెరిపివేయాలని, ముందుకు సాగాలని కోరుకుంటుందని భావిస్తున్నారు.

Recommended Video

నాకు అఫైర్స్, అబార్షన్స్ అని మాట్లాడుతున్నారు, సమంత ఎమోషనల్ నోట్..! || Filmibeat Telugu
నాగ చైతన్యను అన్‌ఫాలో?

నాగ చైతన్యను అన్‌ఫాలో?

ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు కానీ, ఆమె అతి త్వరలో నాగ చైతన్యను అన్‌ఫాలో చేయడం మనం చూడవచ్చని అంటున్నారు. మరోవైపు, సమంత తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి మరో వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చార్ ధామ్ యాత్ర నుంచి ఇప్పుడే తిరిగి వచ్చింది. అప్పుడే మరో వెకేషన్ కు బయలుదేరినట్టు చెబుతున్నారు. నటి సూట్‌కేస్‌తో బతుకుతున్నట్లుగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X