Samantha: సెక్సీగా కనిపించాలంటే చాలా చేయాలి.. మరోసారి సమంత హాట్‌ కామెంట్స్‌

విడాకుల ప్రకటన అనంతరం చాలా రోజుల నుంచి సమంత సోషల్ మీడియా వేదికగా తమ భావాలను పంచుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి దాకా కొన్ని కొటేషన్స్ ద్వారా తన బాధను ఆమె వ్యక్తపరుస్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన పుష్ప సినిమాలో ఆమె ఐటం సాంగ్ చేయడంతో మళ్లీ ఆమె వార్తల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఎవరూ ఊహించని విధంగా ఆమె తాజాగా హాట్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

దీనంతటికీ కారణం సమంతే

దీనంతటికీ కారణం సమంతే

అక్కినేని నాగచైతన్య, సమంత ఇద్దరూ ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల నేపథ్యంలో వారిద్దరూ విడిపోతున్నట్లు గా ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రకటించారు. విడాకులకు కారణం ఏమిటి అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా ఇక మీదట స్నేహితులుగా కొనసాగుతామని భార్య భర్తల అనుబంధం అయితే ముగిసిందని చెబుతూ ఇద్దరు ఉమ్మడి ప్రకటన చేశారు. అయితే విడాకులకు కారణం ఏమిటి అనే విషయం మీద ఎవరికీ సరైన క్లారిటీ లేదు. కానీ దీనంతటికీ కారణం సమంతే అని అంటూ నాగచైతన్య అభిమానులు పెద్ద ఎత్తున చేశారు.

విడాకుల దాకా వ్యవహారం

విడాకుల దాకా వ్యవహారం

కొన్ని మీడియా సంస్థలు సైతం సమంత ఫలానా సినిమాలు ఫలానా వెబ్ సిరీస్ లో నటించడం వల్లే విడాకుల దాకా వ్యవహారం వెళ్లిందని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మరో అడుగు ముందుకు వేసి ఆమెకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని కూడా కథనాలు పుట్టించారు. అయితే చాలా రోజుల పాటు ఓపిక పట్టిన సమంత వాళ్లకు సోషల్ మీడియా వేదికగా సమాధానం కూడా ఇచ్చింది.. తానేంటో తనకు తెలుసు అని ఆమె కామెంట్ చేసింది. అయినా సరే ఎవరు వెనక్కి తగ్గకుండా ఆమె మీద మాటల దాడి కొనసాగిస్తూ ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక కోర్టును ఆశ్రయించడంతో కోర్టు సమంతకు ఊరటనిచ్చింది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి కామెంట్ చేయకూడదు అంటూ సదరు యూట్యూబ్ ఛానల్స్ నోటీసులు కూడా జారీ చేసింది.

మగవాళ్ళు మోసగాళ్లు

మగవాళ్ళు మోసగాళ్లు

అయితే విడాకులు తీసుకున్న తర్వాత తాను ఎంత బాధపడుతున్నాను అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరచడానికి సమంత ఆసక్తి చూపిస్తూ వచ్చింది. అమ్మ చెప్పింది అంటూ కొన్ని కొటేషన్లు వరుసగా షేర్ చేస్తూ వచ్చిన ఆమె తాను విడాకులు షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు, అని అభిమానులకు సంకేతాలు పంపడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఇలాంటి సమయంలో ఆమె పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. దానికి తగ్గట్లుగా ఆ ఐటమ్ సాంగ్ లిరిక్స్ అన్నీ కూడా మగవాళ్ళు అందరినీ మోసగాళ్లు గా చిత్రీకరిస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆంధ్ర ప్రదేశ్ లాంటి చోట్ల అయితే ఈ వ్యవహారం మీద కోర్టు కేసులు కూడా జరిగాయి..

చిన్న క్లిప్ వైరల్

చిన్న క్లిప్ వైరల్

సరిగ్గా ఈ ఐటమ్ సాంగ్ వచ్చిన కొద్ది రోజులకు సోషల్ మీడియాలో నాగచైతన్య ఇంటర్వ్యూ ఇస్తున్న ఒక చిన్న క్లిప్ వైరల్ అయింది. నిజానికి ఆ ఇంటర్వ్యూ అయితే ఇప్పటి వరకు బయటకు రాలేదు, మరి ఇది ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు కానీ తాను ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే కానీ తాను చేసే పాత్రల వల్ల తన కుటుంబం మాత్రం ఇబ్బంది పడే విధంగా ఉంటే అలాంటి పాత్రలు చేయను అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.

అయితే ఇది సమంత కు కౌంటర్ గా నే చాలా మంది భావించారు. సమంత కుటుంబం పరువు తీసే విధంగా కొన్ని పాత్రలలో నటించడం వల్ల విడాకులు వరకు విషయం వచ్చింది అని అంటూ మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సమంత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఐటెం సాంగ్ లో డాన్స్ చేయడం గురించి ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పంచుకుంది.

100 శాతం కష్టపడతా

100 శాతం కష్టపడతా

'నా సినిమా కెరీర్‌లో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో మంచి క్యారెక్టర్లతో పాటు ప్రతినాయకురాలి పాత్రలు పోషించాను. ఫన్నీ, సీరియస్‌ క్యారెక్టర్లలో కూడా నటించాను. ఒక చాట్‌ షో(సామ్ జామ్)కు హోస్ట్‌గా కూడా వ్యవహరించాను. నేను నాకిచ్చిన బాధ్యతను సమర్థంగా పోషించడానికి 100 శాతం కష్టపడతాను. కానీ సెక్సీ (అందం)గా కనిపించాలంటే మాత్రం అంతకుమించి కష్టపడాలి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అని ఈ సందర్భంగా 'ఊ అంటావా మావా.. ఊహు అంటావా' పాట హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించింది సామ్‌.

Recommended Video

Pushpa The Rise Review.. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే
సంచలనాలు

సంచలనాలు

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన 'పుష్ప' బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ టాక్ తో దూసుకెళుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బన్నీ నటన, సుకుమార్‌ టేకింగ్‌పై ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఇక సమంత నటించిన 'ఊ అంటావా మావా.. ఊహు అంటావా' పాట ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫోక్‌ సింగర్‌ ఇంద్రావతి చౌహాన్‌ హస్కీ వాయిస్‌తో ఆలపించిన ఈ పాట సినిమా విడుదలకు ముందే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఇక రిలీజ్‌ తర్వాత అన్ని భాషల్లో కలిపి 20 మిలియన్ వ్యూస్ సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X