నిజాలు అరుదుగా బయటకు వస్తాయ్.. అబద్ధాలే ప్రచారంలో ఉంటాయి..సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రస్తుతానికి సౌత్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న సమంత విడాకులు తీసుకొని ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి.. ఆమె అర్థం అయ్యి అవ్వకుండా పెట్టే పోస్టులు నాగచైతన్యను ఉద్దేశించే అని కొందరు భావిస్తూ ఉంటే ఆమె ఏదో యాదృచ్చికంగా అలాంటి పోస్టులు పెడుతుందని భావించేవాళ్ళు మరికొంతమంది. ఇలా ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ చర్చనీయాంశంగా మారుతూ ఉండే సమంత తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఒక కొటేషన్ చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే

విడిపోతున్నామంటూ
ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత చాలాకాలం స్నేహం తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమను పెద్దలు అందరి సమక్షంలో పెళ్లిగా మార్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ నాలుగేళ్ల దాంపత్య జీవితం అనంతరం గత ఏడాది అక్టోబర్ నెలలో వీరిద్దరూ తాము విడిపోతున్నామంటూ అధికారికంగా ప్రకటించారు.

కోర్టు మెట్లెక్కి
అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు కానీ సమంత పెట్టే పోస్టులతో మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదు అనే భావన కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నిజానికి సమంత విడాకుల వ్యవహారంలో కూడా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో సమంతదే తప్పు అన్నట్లు చాలా మంది అప్పట్లో కామెంట్లు చేశారు. కొంతమంది ఆమె తప్పుడు పనులు చేయడంతోనే చైత్యన్య విడాకులిచ్చాడు అంటూ పెద్దఎత్తున ప్రచారం చేయడంతో కొన్నాళ్లపాటు తట్టుకుని ఆ తర్వాత ఆమె భరించలేక కోర్టు మెట్లెక్కింది.

వార్నింగ్ కూడా
కోర్టు కూడా కర్ర విరగకుండా పాము చావకుండా అసలు సోషల్ మీడియాలో నీ పర్సనల్ లైఫ్ పెట్టడం తప్పు అలా పెట్టినంత మాత్రాన వాళ్ళు కామెంట్ చేయాలని లేదు కానీ సమాచారమంతా పబ్లిక్ లో ఉన్నప్పుడు కామెంట్ చేయడం సహజమే కాబట్టి ఇకమీదట నువ్వు పబ్లిక్ గా పోస్ట్ లు పెట్టడం మానేయ్ అని చెబుతూనే ఆమె విడాకుల గురించి మాట్లాడిన అందరికీ వార్నింగ్ కూడా ఇచ్చింది.

లైఫ్ తో లింక్ చేసి
అలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా సమంత తన బాధను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తాజాగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటో షేర్ చేస్తూ దానికి ఒక కామెంట్ పెట్టింది. అదేమిటంటే నిజాలు అనేవి అరుదుగా బయటకు వస్తాయి కానీ ఎప్పుడూ అబద్ధాలే ప్రచారంలో ఉంటాయి అంటూ ఒక హాలీవుడ్ సినిమా గురించి ఆమె కామెంట్ చేసింది. ఇందులో ఎక్కడా తన పర్సనల్ లైఫ్ గురించి ప్రస్తావన లేకపోయినప్పటికీ ఆమె పర్సనల్ లైఫ్ తో లింక్ చేసి మాట్లాడుతున్నారు నెటిజన్లు.

ప్రస్తుతం కాశ్మీర్ లో
ఇక సమంత వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక తమిళ సినిమా విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకోగా ఆమె నటిస్తున్న మిగతా సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఆమె నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా యశోద సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోపక్క విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











