సమంత- ప్రీతమ్ రిలేషన్ ఇదే.. క్లారిటీ ఇచ్చిన మేకప్ ఆర్టిస్ట్.. ఏడ్చేసిన సమంత?
సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పటికీ సద్దుమణగలేదు. తాము విడిపోతున్నాం అని ఈ జంట అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు విడిపోయారు అనే అంశం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధమైన విధంగా స్పందిస్తూ ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. అయితే అయితే ప్రీతం జుకల్కర్ వ్యవహారంతోనే సమంత విడాకులు ఖాయమయ్యాయి అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం మీద సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

అక్కినేని కోడలు అయి ఉండి
ప్రీతం జకల్కర్ సమంత స్టైలిష్ట్ గా పనిచేస్తున్నారు. గతంలో ప్రీతం జకల్కర్ కూర్చుని ఉండగా అతని ఒడిలో సమంత రెండు కాళ్లు పెట్టిన ఫోటో ఒక దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత అక్కినేని కోడలు అయి ఉండి ఇలాంటి ఫోటోలు ఎలా షేర్ చేస్తావు అంటూ పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లు రావడంతో దాన్ని డిలీట్ చేసింది.

తప్పుగా చిత్రీకరిస్తున్నారు
ఆ తర్వాత మరో సందర్భంలో కూడా జకల్కర్ దొరకడం నా అదృష్టం అని ఐలవ్యూ అన్నట్లుగా కామెంట్ పెట్టడంతో సమంతకు అతనికి మధ్య ఏదో ఉంది అనే విధంగా నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ విషయం మీద స్పందించిన సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ సమంత-జకల్కర్ ల మధ్య ఉన్న బంధాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది..

ఎట్టకేలకు నోరు విప్పి
నిజానికి ప్రీతం జకల్కర్ సమంతను జీజీ అని పిలుస్తాడు జీజీ అంటే అర్థం తెలుసు కదా అంటూ ఆమె గూగుల్ ట్రాన్స్లేటర్ లో జీజీ అనే పదాన్ని ట్రాన్స్లేట్ చేసి చూపించింది.. అక్కడ జీజీ అంటే సిస్టర్ అని అర్థం అన్నట్లుగా చూపబడింది.. అలా వారిద్దరిదీ సోదర భావం అని దాన్ని ఎలా మీరు తప్పుగా అర్థం చేసుకుని కామెంట్లు చేస్తున్నారు అన్నట్టు ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ప్రశ్నించింది.

బిజీగా లేను అందుకే
ఈ రోజు నాకు షూటింగ్ లేదు అందుకే నేను బిజీగా లేను ఈ కారణంగా దేవుడు నాకిచ్చిన తెలివితో తెలివిలేని కొందరికి ఈ విషయాన్ని షేర్ చేయాలని అనుకుంటున్నాను అని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఆమె పేర్కొంది. ఇక ఆమె పెట్టిన స్టేటస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే సమంత తాజాగా షూటింగ్ గ్యాప్ లో కన్నీళ్లు పెట్టుకుంది అని ఆమె గుక్కపెట్టి ఏడ్చింది అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

షూట్ లో ఏడ్చి
విడాకుల ప్రకటన తర్వాత సమంత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో ఒక జూనియర్ కాలేజ్ లో జరుగుతున్న యాడ్ ఫిలిం షూటింగ్ కి హాజరు అయిందట. ఈ యాడ్ ఫిలిం ముంబై ఫిలిం మేకర్ విశేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతుండగా డైరెక్టర్ టేక్ చెప్పగానే యాక్టివ్ అయిపోతున్న సమంత కట్ చెప్పగానే డల్ అయిపోతుందని షూటింగ్ గ్యాప్ లో ఏడుస్తూ ఉందని యూనిట్ సభ్యులు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె చాలా డల్ గా ఉందని కానీ డైరెక్టర్ యాక్షన్ చెప్పినప్పుడు మాత్రమే యాక్టివ్ అవుతోందని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











