సమంత పాన్ ఇండియా వెబ్ సిరీస్.. టాప్ హీరోలతో సెకెండ్ ఇన్నింగ్స్
ఒక్క తెలుగు సినిమా దగ్గర మాత్రమే కాకుండా టోటల్ పాన్ ఇండియా వైడ్ గా ఓ హీరోయిన్ కి మంచి గుర్తింపు అలాగే మంచి క్రేజ్ ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి అతి కొద్ది మంది స్టార్ హీరోయిన్ లలో సమంత ప్రభు కూడా ఉంటుంది. మరి టాలీవుడ్ లో మంచి బ్రేక్ అందుకొని పాన్ ఇండియా లెవెల్లో సమంత తన సామ్రాజ్యాన్ని స్థాపించింది.
అలా తన కెరీర్ మంచి పీక్ లో ఉన్నపుడే తాను పెళ్లి కూడా చేసుకుంది. టాలీవుడ్ అగ్ర కుటుంబం అక్కినేని వారి కోడలిగా యువ హీరో నాగ చైతన్యని ఆమె పెళ్లి చేసుకుంది. కానీ కొన్నేళ్ళకే వీరి వివాహ బంధం విడిపోయింది. దీనితో సమంత కెరీర్ క్లోస్ అయిపోయినట్టే అని చాలా మంది అనుకున్నారు కానీ పైకి విసిరిన రాయి రెట్టింపు వేగంతో కిందకి వస్తుంది అన్నట్టుగా ఆ తర్వాత నుంచే సమంత అందరికీ మరింత షాకిచ్చింది.

టాలీవుడ్ కోలీవుడ్ సినిమాలు చేయడంతో పాటుగా ఓటిటి షోలు ఇలా విడాకులు తర్వాత ఒక ఊహించని ఆన్సర్ ని ఆమె అందించింది అని చెప్పాలి. కాగా వాటితో పాటుగా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ అయితే ఒక బాంబ్ లా పేలింది. ఇలా కెరీర్ లో దూసుకెళ్తున్న సమంతని తన ఆరోగ్యం వెనక్కి లాగింది. సడెన్ గా సమంతకి కండరాల సంబంధిత వ్యాధి ఉందని బయట పడింది.
కానీ అక్కడ కూడా సామ్ ఆగలేదు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రెండు యశోద, శాకుంతలం ఫినిష్ చేసింది. అలాగే హీరోయిన్ గా యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమా చేసింది. ఇక ఇక్కడితో అన్నిటికి బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యంపై ద్రుష్టి పెట్టింది. ఇలా కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకున్న సమంత మరోసారి రెట్టింపు వేగంతో రీఎంట్రీ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది.

కాగా ఈమె రీ ఎంట్రీని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో లాక్ చేస్తుందట. పాన్ ఇండియా భాషలు అంటే జెనరల్ గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మలయాళ భాషలు అంటారు. అయితే ఇందులో మూడు భాషల్లో ప్రాజెక్ట్ లు సమంత ఇప్పుడు ఓకే చేసిందట. ఆల్రెడీ హిందీలో ఓ వెబ్ సిరీస్ కి సైన్ చేయగా తమిళ్ లో విజయ్ చివరి సినిమాలో నటించేందుకు ఓకే చేసింది అని టాక్ ఉంది.
అలాగే ఇప్పుడు మలయాళంలో బిగ్ స్టార్ మమ్ముట్టి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ సినిమాకి ఆమెని ఓకే చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇలా సమంత అయితే ఓ రేంజ్ లో తన కం బ్యాక్ ని ప్లాన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పవచ్చు. మరి తెలుగులో ఇంకా సమంత ఏ సినిమా ఎవరితో ఓకే చేసింది అనే విషయాలు ఇంకా బయటకి రాలేదు.


Click it and Unblock the Notifications











