For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పదేళ్ల ప్రేమ.. రెండేళ్ల వివాహా జీవితమన్న సమంత.. శుభాకాంక్షల వెల్లువ

|

ఏ మాయ చేసావే చిత్రంలో జెస్సీ ప్రేమను పొందడానికి కార్తీక్ ఎంత తపనపడ్డాడో తెలుగు నాట అందరికీ తెలిసిందే. అయితే అది సినిమా కోసమే అయి ఉంటుందని అంతా అనుకున్నారు అప్పుడు. కానీ తీరా చూస్తే.. జెస్సీ, కార్తీక్ ఒక్కటయ్యారు. చక్కగా కాలాన్ని గడిపేస్తున్నారు.

సమంత, నాగ చైతన్యకు పెళ్లై రెండేళ్లైంది. ఈ సందర్భంగా వీరిద్దరికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వెండితెరపై భార్యాభర్తలుగా నటించిన ఈ జంట నిజజీవితంలోనూ ఒక్కటై అభిమానులందర్నీ ఆశ్చర్యపరిచారు.

మొదటి చిత్రంతోనే మొదలు..

మొదటి చిత్రంతోనే మొదలు..

సమంత, నాగ చైతన్య కలిసి నటించిన ఏ మాయ చేశావేచిత్రం నుంచి వీరి మధ్య స్నేహం మొదలైంది. అది క్రమక్రమంగా పెరుగుతూ ప్రేమగా మారింది. చివరకు రెండు కుటుంబాల ఇష్టంతో పెళ్లిగా మారింది. వారి కథ సుఖాంతం అయింది. అయితే వారి ప్రేమకు పదేళ్లని సమంత పేర్కొంది. అంత కాలం వారిద్దరి వ్యవహారాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.

 జంటగా నటించిన చిత్రాలు..

జంటగా నటించిన చిత్రాలు..

ఏ మాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం చిత్రాల్లో జంటగా నటించి బెస్ట్ పెయిర్ గా అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్నాక కలిసి నటించిన చిత్రం మజిలీ. ఈ మూవీ వీరి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలు వీరిద్దరి నటలకు మంచి ప్రశంసలు వచ్చాయి.

పెళ్లాయ్యాక జోరు పెంచిన సమంత..

పెళ్లాయ్యాక జోరు పెంచిన సమంత..

పెళ్లాయ్యాక ఎవరైనా సినిమాలు మానేస్తారు కానీ..సమంత మాత్రం రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది. వరుస హిట్స్తో ఫుల్ స్వింగ్లో ఉంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ సూపర్ స్టార్ ట్యాగ్ కూడా చేజిక్కించుకునేలా ఉంది. తమిళ,తెలుగు భాషల్లో వరుస విజయాలతో సమంత జెట్ స్పీడ్లో సినిమాలను చేసేస్తోంది. రీసెంట్ గా ఓ బేబీ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

వివాహా వార్షికోత్సవ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్..

వివాహా వార్షికోత్సవ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్..

సమంత, నాగ చైతన్యలకు పెళ్లై నేటికి రెండేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. స్ట్రాంగర్.. స్ట్రాంగర్.. పదేళ్ల ప్రేమ.. రెండేళ్ల వివాహాం... అంటూ ఇన్నేళ్లలో బెస్ట్ మెమోరిస్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

వెల్లువల శుభాకాంక్షలు..

సమంత పెట్టిన ఈ పోస్ట్కు అభిమానులే కాదు..తోటీ హీరోయిన్లు, డైరెక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్, నందిని రెడ్డి, హన్సిక, నీరజ కోనలాంటి ఎంతో మంది విషెస్ తెలిపారు. రానా కూడా వీరికి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రానా పెట్టిన ఈ పోస్ట్ కు నమ్రతా శిరోద్కర్ రిప్లై ఇస్తూ.. సమంత, నాగచైతన్యలకు విషెస్ తెలిపింది.

English summary
Samantha Shared A Post On Her Marrinage Anniversary. She Said That Stronger and stronger, two year anniversary and a ten year story, stuck on you. So Many heroines Like Rakul, Kajal, Lavanya Tripati Wishes Them. Rana Daggubati Specially Wished Them.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more