Samantha Networth: 16 ఏళ్ల సినీ ప్రయాణం.. సమంత ఆస్తులు ఎన్ని కోట్లంటే?

Samantha Net Worth 2026: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్‌ సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా దూసుకుపోతున్నారు. దాదాపు 16ఏండ్ల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించిన సమంత, నేటి తరం మోస్ట్ ఎఫెక్టివ్ యాక్టర్స్ ల్లో ఒకరు. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన, నిర్మించిన 'మా ఇంటి బంగారం' సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో మరోసారి సమంత పేరు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ తరుణంలో సామ్ వ్యక్తిగత విషయాలు వైరలవుతున్నాయి.

Also Read
Prabhas Upcoming Movies Lineup: బాక్సాఫీస్‌పై ప్రభాస్ దండయాత్ర.. రూ.5000 కోట్ల టార్గెట్ ?
Prabhas Upcoming Movies Lineup: బాక్సాఫీస్‌పై ప్రభాస్ దండయాత్ర.. రూ.5000 కోట్ల టార్గెట్ ?

సమంత .. 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించారు. చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన 'ఏ మాయ చేశావే' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వరుస అవకాశాలను అందుకున్నారు. అలా దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది, మనం, సన్నాఫ్ సత్యమూర్తి, రంగస్థలం, మహానటి, ఓ బేబీ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ కూడా స్టార్ డమ్ సొంతం చేసుకుంది.

Recommended For You
Kalki2: ప్రభాస్ కల్కి 2 లో ఆలియా భట్? నాగ్ అశ్విన్ ఆలోచనలే వేరబ్బా!
Kalki2: ప్రభాస్ కల్కి 2 లో ఆలియా భట్? నాగ్ అశ్విన్ ఆలోచనలే వేరబ్బా!
Samantha Net Worth 2026

తర్వాత ఓటీటీ ప్రపంచంలోనూ అడుగు సామ్ తన సత్తా చాటారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో ఆమె పోషించిన పాత్రకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. అలాగే పుష్ప సినిమాలోని "ఊ అంటావా" పాటతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించారు. కమర్షియల్ సినిమాలు, కంటెంట్ ఆధారిత కథలు రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.

You May Also Like
Sing Geetham Day 6 Collections: నాగ్ అశ్విన్‌కు ఎదురుదెబ్బ.. 'సింగ్ గీతం' ఎంత రాబట్టిందో తెలుసా?
Sing Geetham Day 6 Collections: నాగ్ అశ్విన్‌కు ఎదురుదెబ్బ.. 'సింగ్ గీతం' ఎంత రాబట్టిందో తెలుసా?

ఇలా తన 16 ఏళ్ల కెరీర్ లో సమంత ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుంది. ఈ క్రమంలో భారీ మొత్తంలోనే కూడపెట్టిందని ఇండస్ట్రీ టాక్. పలు మీడియా నివేదికల ప్రకారం ఆమె నికర ఆస్తుల విలువ రూ.100 కోట్ల నుంచి రూ.125 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. భారీ ప్రాజెక్టులు, పాన్ ఇండియా సినిమాల్లో బిజీబిజీగా మారిన ఈ అమ్మడు ఆస్తి మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Maa Inti Bangaaram Advance Booking: ఓవర్సీస్‌లో సమంత ర్యాంపేజ్.. 'మా ఇంటి బంగారం’కు అదిరేపోయే బుకింగ్స్..
Maa Inti Bangaaram Advance Booking: ఓవర్సీస్‌లో సమంత ర్యాంపేజ్.. 'మా ఇంటి బంగారం’కు అదిరేపోయే బుకింగ్స్..

సమంత కేవలం సినిమాలతోనే కాదు.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు కూడా భారీ మొత్తంలో సంపాదిస్తుంది. పెప్సీ, శాంసంగ్, మింత్రా, తనిష్క్, లక్స్, నైవియా వంటి ప్రముఖ బ్రాండ్లకు ఆమె బ్రాండ్ అంబాసిటర్ గా వ్యవహరించారు. ప్రకటనలు, ప్రమోషనల్ క్యాంపెయిన్‌ల ద్వారా ఏటా కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆమెకు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా ప్రముఖ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకుంటున్నాయి.

అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ప్రధాని మోదీ రీల్‌లో AA23 థీమ్ సాంగ్!
అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ప్రధాని మోదీ రీల్‌లో AA23 థీమ్ సాంగ్!

నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా సమంత అడుగులు వేస్తున్నారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి కంటెంట్ క్రియేషన్ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న 'మా ఇంటి బంగారం' సినిమాను కూడా ఆమె నిర్మిస్తున్నారు. అలాగే.. 'సాకీ' పేరుతో ఫ్యాషన్ బ్రాండ్, 'సీక్రెట్ ఆల్కెమిస్ట్' పేరుతో పెర్ఫ్యూమ్ బ్రాండ్ వ్యాపారాల్లో అడుగుపెట్టారు. ఈ వ్యాపారాల ద్వారా కూడా భారీ మొత్తంలో ఆర్జీస్తున్నట్లు తెలుస్తోంది.

RAAKA: పుష్ప 2 సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న రాకా.. బన్నీ-అట్లీ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
RAAKA: పుష్ప 2 సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న రాకా.. బన్నీ-అట్లీ మాస్టర్ ప్లాన్ ఇదేనా!

రియల్ ఎస్టేట్ రంగంలో కూడా సమంత భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్‌లో సుమారు రూ.7.8 కోట్ల విలువైన లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్, ముంబైలో సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న లగ్జరీ విల్లా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాల్లో విలువైన ప్రాపర్టీలు ఉన్నట్లు ప్రచారం ఉంది. ఇక లగ్జరీ కార్లంటే కూడా సమంతకు చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ 7 సిరీస్, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్, రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ, పోర్షే కేమాన్ జీటీఎస్ వంటి లగ్జరీ, హైఎండ్ కార్లు ఉన్నట్లు సమాచారం.

వాళ్లిద్దరిలో ఆ మ్యాజిక్.. పవన్ కల్యాణ్, సీఎం విజయ్‌పై సమంత కామెంట్స్
వాళ్లిద్దరిలో ఆ మ్యాజిక్.. పవన్ కల్యాణ్, సీఎం విజయ్‌పై సమంత కామెంట్స్

సమంత తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒదిదుకులును ఎదుర్కొంది. ఆమె ఓ హీరోయిన్ గా మాత్రమే కాదు. నిర్మాతగా, వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకుంది. నేటి యువతకు స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం 'మా ఇంటి బంగారం'విడుదలకు సిద్ధమవుతుండగా, కెరీర్‌లో మరో విజయాన్ని అందుకోవడానికి సమంత రెడీ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X