Samantha Networth: సమంత నికర ఆస్తులు ఎన్ని కోట్లు? రాజ్ నిడిమోరు కంటే ఎన్ని కోట్లు ఎక్కువ?
Samantha-Raj Nidimoru: టాలీవుడ్ అగ్రనటి సమంత రూత్ ప్రభు తన డేటింగ్ రూమర్లకు చెక్ పెట్టింది. 'ది ఫ్యామిలీ మాన్' దర్శకుడు, తన బాయ్ ఫ్రెండ్ ను రాజ్ నిడుమోరుతో వివాహం చేసుకున్నారు. వీరి జంట వివాహానికి కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ వేదికగా మారింది. డిసెంబర్ 1 తేదీ ఉదయం లింగ భైరవి దేవాలయంలో హిందూ సంప్రదాయ ప్రకారం సమంత-రాజ్ వివాహబంధంతో ఒక్కటయ్యారని ఫౌండేషన్ సర్కిల్స్ ధృవీకరించాయి. చాలా తక్కువ మంది సన్నిహితుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఆస్తుల వివరాలు చర్చనీయంగా మారాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం నటిగా మాత్రమే కాకుండా బిజినెస్ ఉమెన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంటుంది. 2010లో 'ఏ మాయ చేశావే'తో తెరపైకి వచ్చిన సమంత.. బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, రంగస్థలం వంటి హిట్ సినిమాలతో స్టార్‌డమ్‌ను అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకే ఏడాది ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డులు అందుకోవడం ఆమె కెరీర్‌లో పెద్ద మైలురాయి. ఆ తరువాత బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు 'ది ఫ్యామిలీ మాన్ 2' వెబ్ సిరీస్ లో రాజీ పాత్రతో నటించి మెప్పించింది.

పాన్-ఇండియా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఆమె నార్త్ కూడా తన మార్కెట్ ను ఏర్పాటు చేసుకుంది. సమంత ఒక్కో సినిమాకు రూ 5 నుంచి రూ. 8 కోట్లు, వెబ్ ప్రాజెక్టులకు రూ. 8 నుంచి 12 కోట్లు తీసుకుంటుందట. సంవత్సరానికి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా రూ. 6 - 8 కోట్లు సంపాదిస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. హైదరాబాద్, చెన్నైలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, స్టార్టప్‌లలో ఈక్విటీ పెట్టుబడులు కూడా ఆమె నికర సంపదను పెంచుతున్నాయి. ప్రస్తుతం సమంత నెట్‌వర్త్ రూ. 100 నుంచి రూ. 110 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.
రాజ్ నిడిమోరు ఎవరు?
బాలీవుడ్ లో సక్సెస్ పుల్‌గా దూసుకెళ్తున్న డైరెక్టర్స్ లో రాజ్ నిడిమోరు ఒకరు. ది ఫ్యామిలీ మెన్ (The Family Man)వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. రాజ్-డీకే ద్వయం రూపొందించిన స్త్రీ (Stree), గో గోవా గాన్ (Go Goa Gone), ఫ్లేవర్స్ (Flavors), షోర్ ఇన్ ది సీటీ (Shor in the City), హ్యాపీ ఎండింగ్ (Happy Ending), ఏ జెనటిల్ మ్యాన్ (A Gentleman)వంటి సినిమాలు తన క్రియేటివ్ విజన్‌ను చూపించాయి. ప్రస్తుతం ఆమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (The Family Man Season 3) కూడా భారీ విజయం సాధించింది. సక్సెస్ పుల్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చి పెట్టింది.
అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. రాజ్ నిడిమోరు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జన్మించారు. తెలుగువాడైన ఆయన SVU కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ చదివారు. అక్కడే తన సహడైరెక్టర్ అయిన కృష్ణ డీకే తో పరిచయం ఏర్పడింది. తరువాత ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ స్టడీస్ కొనసాగించారు. సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడుతున్న సమయంలోనే ఇద్దరికీ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. తమ కెరీర్ ను పూర్తిగా మార్చుకున్నారని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఫలితంగా ఏర్పడింది రాజ్ అండ్ డీకే (Raj & DK) అనే సంస్థ, ఇప్పుడిది ఓటీటీ ప్రపంచంలో ఒక బ్రాండ్‌గా మారింది.
రాజ్ నిడిమోరు నెట్‌వర్త్ ఎన్ని కోట్లంటే?
పింక్ విల్లా నివేదిక ప్రకారం, డైలీ జగ్రన్ రిపోర్టుల ప్రకారం. రాజ్ నిడిమోరు నెట్ వర్త్ రూ.83-85 కోట్ల మధ్య ఉన్నట్లు అంచనా. ఈ మొత్తం దర్శకత్వం, ప్రొడక్షన్, స్క్రీన్ రైటింగ్ పనుల ద్వారా వచ్చిన సంపాదన అని పేర్కొంటున్నారు. స్ట్రీమింగ్ డీల్స్, థియేట్రికల్ రిలీజ్‌లు, బ్యాక్‌ఎండ్ ప్రొడక్షన్ ఒప్పందాలు ఇవే ఆయన ఆదాయ మార్గాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ లెక్కలను బట్టి చూస్తే.. సమంత సంపాదననే ఎక్కువ.


Click it and Unblock the Notifications











