బికినీలో సమంత మరో హాట్ యాంగిల్.. గ్లామర్ తో చంపేస్తోందిగా..
టాలీవుడ్ సినిమా ప్రపంచంలో చాలామంది హీరోయిన్స్ కూడా గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే నటనతో పాటు అందాన్ని కూడా సరి కొత్తగా పరిచయం చేస్తూ ఉంటారు. అలాంటి అతి కొద్దిమంది బ్యూటీ లలో సమంత టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. ఇటీవల కాలంలో సమంత తనలోని సరికొత్త గ్లామర్ ను బయటపెడుతోంది. నెవర్ బిఫోర్ బికినీలో షాక్ ఇస్తుంది అనే చెప్పాలి. రీసెంట్ గా సమంత కు సంబంధించిన మరో బికినీ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ఒక్క పాటతో
నాగచైతన్యతో విడాకులు తీసుకున్క్ తర్వాత సమంత తన జీవితాన్ని సరికొత్త గా మొదలుపెట్టినట్లు గా తెలుస్తోంది. ఆమె గతంలో ఎప్పుడూ లేని విధంగా సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ను కూడా సరికొత్త దారిలో స్టార్ట్ చేస్తోంది. ఏకంగా పుష్ప సినిమా లో సమంత మొదటిసారి ఒక ఐటం సాంగ్ చేసింది. ఇక ఆమె కెరీర్ విషయంలో ఏ స్థాయిలో ఆలోచిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పాటతో ఒక్కసారిగా ఇండియాలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది.

ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ
సమంత ఎలాంటి సినిమాలు చేసినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కేవలం సినిమాల తోనే కాకుండా ఓటీటీ ద్వారా కూడా ఆమె జనాలకు ఎంతగానో దగ్గరవుతోంది. ఇటీవల ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 లో సమంత చేసిన పాత్ర అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ కేవలం ప్రయోగాత్మకమైన పాత్రలను మాత్రమే షేర్ చేసుకుంటోంది.

మరో అధ్యాయం..
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్స్ చాలానే వస్తున్నాయి. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఆమె మరో అధ్యాయం మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పాన్ ఇండియా బాటలో పయనిస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది సమంతను మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.

నిమిషాల్లోనే వైరల్..
ఇక సమంత ఇటీవల తన స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో గ్రాండ్ గా ఎంజాయ్ చేస్తున్న సమంత ఫ్రెండ్స్ తో సరదాగా దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఏకంగా బికినీ ఫోటోలు కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో నిమిషాల్లోనే అది వైరల్ గా మారింది.
Recommended Video

ఎన్టీఆర్ సినిమాలో..?
సమంత తో పాటు ఆమె స్నేహితులు కూడా బికినీలో దర్శనం ఇచ్చారు. సమంత ప్రస్తుతం చాలా పాజిటివ్ గా తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాలో సమంతను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం


Click it and Unblock the Notifications











