భర్త ఇష్టం కోసం ఆ నొప్పిని భరించిన సమంత.. అందంగా కనిపించడానికి ఆ చోట గాయాలు
అక్కినేని సమంత ఎలాంటి డ్రెస్ లో కనిపించినా కూడా ఆ రోజు ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. పెళ్లి చేసుకున్నా కూడా ఇంకా స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ తో ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్స్ కి పోటీగా నిలుస్తోంది. అలాగే లేడి ఓరియెంటెడ్ సినిమాలతో కూడా అమ్మడు తన క్రేజ్ ని మార్కెట్ ని మరింత పెంచుకుంటోంది. ఇక ఇటీవల అమ్మడు భర్త కోసం ఒక నొప్పిని కూడా భరించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recommended Video

నెవర్ బిఫోర్ అనేలా..
సమంత డ్రెస్సింగ్ స్టైల్ ఎప్పుడు చూసినా కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది. తన స్టార్ డమ్ తో అమ్మడు ఎన్ని బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నా కూడా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలకే ఎక్కువగా క్రేజ్ అందుతోంది. కొన్నిసార్లు సమంత డ్రెస్సింగ్ స్టైల్ తో పాటు ఆమె చూపించే హావభావాలు ఎంతో న్యాచురల్ గా ఉంటాయి.

భర్త కోసం గాయాన్ని ఇష్టంగా..
ఓ వైపు గ్లామర్ బ్యూటీగా మెరిస్తూనే మరోవైపు సాంప్రదాయ పద్దతిలో కూడా సమంత తనను తాను చాలా కొత్తగా ప్రజెంట్ చేసుకుంటుంది. ఇక ఇటీవల సమంత తన భర్త కోసమే ఒక గాయాన్ని కూడా చాలా ఇష్టంగా అనుభవించిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. నేను ఎలా ఉంటే అందంగా ఉంటానో నా భర్త నాకు నిత్యం సలహాలు ఇస్తూనే ఉంటాడని గత ఇంటర్వ్యూలలో చాలా సార్లు సమంత వివరణ ఇచ్చింది.

కొత్తగా చెవిపొగులతో..
ఇక ఇటీవల సమంత చెవిపై కొత్తగా మరికొన్ని చెవిపొగులతో దర్శనమిచ్చింది. ఈ మధ్యనే కొత్తగా ఇంకొన్ని కుట్టించుకున్నట్లు తెలియజేసిన సమంత అభిమానులను కొత్తగా ఆకట్టుకుంది. ఇక ఎప్పటిలానే ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నీ చై కోసం అందంగా కనిపించడానికె ఆ నొప్పిని భరించవా అంటూ ఓ వర్గం నెటిజన్స్ స్వీట్ కామెంట్స్ చేస్తున్నారు.

రానా పెళ్లి వేడుకలో ఖరీదైన చీర
ఇక మొన్న సమంత రానా పెళ్లి వేడుకలో సందడిగా కనిపించిన విషయం తెలిసిందే. దగ్గుబాటి వారి పెళ్లి వేడుకలో అక్కినేని వారి కోడలు చాలా సరదాగా అల్లరిగా కనిపించిందని మీడియాలో వార్తలు చాలానే వైరల్ అయ్యాయి. ఇక ఆపెళ్లిలో సమంత పెళ్లి కూతురికి ఏ మాత్రం తీసిపోని విధంగా లక్ష రూపాయలు విలువ చేసే ఖరీదైన చీర కూడా కట్టిందని సోషల్ మీడియాలో ఫొటోలు ట్రెండ్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











