twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోషల్ మీడియాలో సమంతకు మరింత ఆదాయం.. ఆ రికార్డుతో మళ్ళీ రేట్లు పెంచేసిందిగా..

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత ఇటీవల సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్తులు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ సాంగ్స్ తో చేయడానికి కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఆమె గతంలో కంటే ఇప్పుడు సరికొత్త కెరీర్ పై ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా అర్థమవుతోంది. ప్రస్తుతం సమంత చేతిలో మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. సోషల్ మీడియా ద్వారా సమంత మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటోంది. ఇక ఇటీవల ఆమె ఒక రికార్డును బ్రేక్ చేసింది. దీంతో సోషల్ మీడియా ఆదాయం మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

    బాలీవుడ్ లో కూడా

    బాలీవుడ్ లో కూడా

    సమంత అక్కినేని ఇటీవల నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు వరకూ ఆమె సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులతో పోలిస్తే ఇప్పుడు మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అనంతరం ఆమె భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటోంది. దాని ద్వారా వచ్చిన క్రేజ్ తోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు అందుతున్నాయి.

    పూర్తి స్థాయిలో సెట్స్ పైకి వచ్చేవరకు..

    పూర్తి స్థాయిలో సెట్స్ పైకి వచ్చేవరకు..

    సమంత తన స్థాయిని మరింత పెంచుకునే విధంగా అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆమెకు ఇటీవల రెండు మంచి ఆఫర్లు కూడా వచ్చినట్లు టాక్ అయితే వచ్చింది. అయితే ఆ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో సెట్స్ పైకి వచ్చేవరకు క్లారిటీ ఇవ్వకూడదు అని సమంత నిర్ణయించుకుందట. అంతేకాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా ఎప్పటిలానే సమంతకు భారీ స్థాయిలో ఆఫర్స్ వస్తున్నాయి.

    సోషల్ మీడియాలో న్యూ రికార్డు

    సోషల్ మీడియాలో న్యూ రికార్డు

    అసలు విషయంలోకి వస్తే సమంత ఇటీవల సోషల్ మీడియాలో సమంత సరికొత్త రికార్డును అందుకుంది. అత్యధిక వేగంగా ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ల ఫాలోవర్స్ రికార్డుని అందుకుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వారిలో సమంత కూడా టాప్ లిస్టులో చేరిపోయింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

    సోషల్ మీడియాలో బిజీగా

    సోషల్ మీడియాలో బిజీగా

    సమంత ఇంస్టాగ్రామ్ లో చాలా చురుగ్గా కనిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. అంతేకాకుండా స్టోరీలను కూడా తరచుగా పోస్ట్ చేస్తూ జీవితానికి సంబంధించిన ఎన్నో కొటేషన్స్ కూడా పోస్ట్ చేస్తుంది. ముఖ్యంగా విడాకుల అనంతరం సమంత ఎక్కువగా అలాంటి పోస్టులు పెడుతోంది. అలాగే డివోషనల్ వైపు కూడా సమంత కొత్త తరహాలో పయనిస్తోంది.

    ఒక్క పోస్టుకు ఎంత తీసుకుంటుందంటే?

    ఒక్క పోస్టుకు ఎంత తీసుకుంటుందంటే?

    ఇక సమంత సోషల్ మీడియా ద్వారా కూడా మంచి ఆదాయం అందుకుంటోంది. ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా బ్రాండ్ కు సంబంధించిన ఒక పోస్ట్ చేస్తే రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యునరేషన్ దక్కుతుందట. ఇక ఇప్పుడు సమంత 20 మిలియన్స్ ఫాలోవర్స్ మార్క్ ను అందుకోవడంతో రేటును కొంత పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత ఒక్క పోస్టు కోసం మూడు లక్షలకు పైగా డిమాండ్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

    English summary
    Samantha new remuneration rates for social media instagram post
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X