twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి పేరు మార్చుకున్న సమంత.. నన్ను నేను మార్చుకోవాలి అంటూ మరో షాకింగ్ పోస్ట్!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల సమంత నాగ చైతన్య విడాకుల వార్త అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. గత కొంతకాలంగా ఈ విషయంపై అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు వచ్చిన రూమర్స్ అబద్ధం అనుకున్న వారికి మాత్రం ఈ టాలీవుడ్ జంట పెద్ద షాక్ అయితే ఇచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా అక్కినేని అభిమానులు మాత్రం ఈ వార్తలను ఏ మాత్రం మర్చిపోలేక పోతున్నారు. ఇక మరో వైపు సమంత సోషల్ మీడియాలో వివిధ రకాల భావోద్వేగమైన పోస్టులు పెడుతూ ఎంతగానో ఆలోచింపజేస్తుంది. అలాగే సమంత మరోసారి పేరు కూడా మార్చుకోవడం వైరల్ గా మారింది

    బ్యూటిఫుల్ జోడి బ్రేకప్

    బ్యూటిఫుల్ జోడి బ్రేకప్

    కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం లో కూడా బెస్ట్ స్టార్ కపుల్స్ గా గుర్తింపు అందుకున్న అతి కొద్దిమంది వారిలో సమంత నాగ చైతన్య టాప్ లిస్టులో ఉంటారని చెప్పవచ్చు. వీరికి సంబంధించిన ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఏదైనా వేడుకకు ఇద్దరు కలిసి వెళ్తే మాత్రం కూడా వీరిపైనే కెమెరాలన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. అలాంటి బ్యూటిఫుల్ జోడి బ్రేకప్ చెప్పడం అభిమానులకు మాత్రం అస్సలు నచ్చడంలేదు. అయినప్పటికీ వారి వ్యక్తిగత విషయంలో ఎవరికి ప్రశ్నించే హక్కు కూడా లేదని కొందరు మద్దతు తెలుపుతున్నారు.

    వారి నిర్ణయాలను గౌరవించి..

    వారి నిర్ణయాలను గౌరవించి..

    ఇప్పటికే ఈ జంట విడిపోవడంపై కొంత మంది ప్రముఖులు కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. కొంత బాధగా ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత నిర్ణయాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ సమయంలో కూడా వారి ప్రైవసీకి మాత్రం భంగం కలిగించకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున కూడా ఈ విషయంలో కాస్త ఎమోషనల్ అవుతూనే సోషల్ మీడియా లో ట్వీట్ చేశారు. అయితే సమంతతో మాత్రం ఎప్పటిలానే మంచి సాన్నిహిత్యం కూడా ఉంటుందని వివరణ ఇవ్వడం విశేషం.

    సమంత సరికొత్త స్టోరీలు

    సమంత సరికొత్త స్టోరీలు

    సమంత నాగచైతన్య విడాకులపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. నాగచైతన్య మాత్రం ప్రస్తుతం ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి తన పనులతో బిజీగా మారుతున్నాడు. అయితే సమంత మాత్రం ఎప్పటిలానే సోషల్ మీడియాలో బిజీగా ఉంది. కానీ గతంలో మాదిరిగా మాత్రం పోస్టులు పెట్టడం లేదు. ఆమె సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాట్లు అర్థం వచ్చేలా కొటేషన్స్ అలాగే కొన్ని అర్థవంతమైన పాటలను కూడా ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేస్తోంది.

    ప్రపంచాన్ని మార్చే ముందు..

    ప్రపంచాన్ని మార్చే ముందు..

    రీసెంట్ గా సమంత ఒక ఇంగ్లీష్ సాంగ్ ను తన ఇన్స్టాల్ స్టోరీ లో షేర్ చేసుకుంది. ప్రపంచాన్ని మార్చే ముందు తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్థం వచ్చేలా ఉన్న చేంజ్ మై క్లాత్స్ అనే పాటను లిరికల్ గా పోస్ట్ సిగేసింది. సమంత తనలోని భావాలను ఇలా విబిన్నంగా చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

    కలలు కంటున్నాను..

    కలలు కంటున్నాను..

    ఇంకా ఆ పాటలో అర్థం ఏముందంటే.. నేను ప్రపంచాన్ని మార్చాలనుకుంటే, నన్ను నేను మార్చుకోవాలి నేను నా మంచం తయారు చేయాలి, నేను షెల్ఫ్‌ని దుమ్ము దులపాలి మధ్యాహ్నం వరకు మంచం మీద పడుకోకూడదు. నేను చేయాలనుకుంటున్న పనుల గురించి కలలు కంటున్నాను... అని సమంత చాలా అర్థవంతంగా పాటను పోస్ట్ చేసినట్లు అర్థమయ్యింది. అంటే సమంత మళ్ళీ తన సినీ జీవితాన్ని ఎప్పటిలానే. కొనసాగించాలని అనుకుంటున్నట్లు కూడా అనిపిస్తోంది.

    Recommended Video

    Love Story Movie Team Interview | Naga Chaithanya, Sekhar | Easwari Rao
    మళ్ళీ పేరు మార్చుకున్న సమంత

    మళ్ళీ పేరు మార్చుకున్న సమంత

    అంతే కాకుండా సమంత సోషల్ మీడియాలో కూడా తన పేరును మార్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పెళ్లికి ముందు వరకు కూడా సమంత రూత్ ప్రభు అని సోషల్ మీడియాలో తన పేరును నమోదు చేసుకున్న సమంత ఆ తర్వాత నాగచైతన్య మూడుముళ్లు వేయడంతో అక్కినేని పేరును కూడా జత చేసుకుంది. ఇక ఎప్పుడైతే విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారో ఆ తర్వాత ఆమె S అనే పదాన్ని తన పేరుగా మార్చుకుంది. ప్రస్తుతం మళ్లీ పాత పద్ధతిలోనే సమంత రూత్ ప్రభు అని సోషల్ మీడియా ఖాతాలకు పేరును మార్చేసింది.

    English summary
    Samantha new thought post in instagram story and changed her name
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X