సమంత యువతిగా మాత్రమే.. వృద్ధురాలి పాత్రకు నో!
సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శత్వంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంత యంగ్ బ్యూటీగా, అలాగే 70 వృద్ధిరాలిగా నటించాల్సి ఉంది. రిస్క్ అయినా కూడా సమంత వృద్ధురాలి పాత్రకు ఒకే చెప్పిందట. కానీ తాజాగా ఆ పాత్ర నుంచి సమంత వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో వృద్ధురాలి గెటప్ లో నటించడం రిస్క్ అని, కెరీర్ పై తీవ్రమైన ప్రభావం పడుతుందని సన్నిహితులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీనితో సమంత ఆ పాత్రలో నటించకపోవడమే మంచిదని తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. యువతిగా మాత్రం సమంతే నటిస్తుంది. దర్శకురాలు నందిని రెడ్డి వృద్ధురాలి పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ లక్ష్మిని ఎంపిక చేసుకుందట. ఘనవిజయం సాధించిన కొరియన్ మూవీకి మిస్ గ్రానికి ఇది రీమేక్. ఫోటో తీసించుకోవడానికి స్టూడియోకు ఓ వృద్ధురాలు వెళుతుంది. స్టూడియో నుంచి తిరిగి రాగానే ఆమెకు తన పోలికతోనే 20 ఏళ్ల యువతీ కనిపిస్తుంది.

వీరిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఓ బేబీ ఎంత సక్కగున్నావే అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత, నాగ చైతన్య కలసి మరో చిత్రంలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మజిలీ. వివాహానంతరం సమంత, చైతు కలసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే.


Click it and Unblock the Notifications











