రియాలిటీ షో హోస్ట్‌గా సమంత.. సోనీ లివ్ టాక్ షోకు రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?

సినీ తారలు తమకు ఉన్న గ్లామర్, క్రేజ్, టాలెంట్‌ను ఉపయోగించుకోవడంలో ముందుంటారు. సినిమాలే కాకుండా బుల్లితెర మీద వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలతో దండిగా డబ్బులు సంపాదించడమే కాకుండా తమ కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుండటం గమనిస్తూనే ఉంటాం. అయితే తాజాగా సమంత కూడా తానేమీ అందుకు అతీతం కాదు అంటూ బుల్లితెరపైకి ఫోకస్ షిఫ్ట్ చేసింది. తాజాగా మా ఇంటి బంగారం సినిమాతో 100 కోట్ల బాక్సాఫీస్ స్టామినాను పరిచయం చేసిన స్టార్ హీరోయిన్ కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే రియాలిటీ షో కోసం ఆమె తీసుకొంటున్న రెమ్యునరేషన్ కూడా భారీ చర్చకు దారి తీసింది. త్వరలో ప్రారంభం కానున్న రియాలిటీ షో వివరాలు, అలాగే ఆమె పారితోషికం వివరాల్లోకి వెళితే..

వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలను దాటుకొని.. మూడేళ్ల తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రం గత మూడు వారాలుగా వసూళ్లతో రఫ్ ఆడిస్తూ 100 కోట్ల రూపాయలకు చేరువైంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె గర్బవతి కావడంతో కెరీర్‌కు చిన్న బ్రేక్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.

Samantha remuneration for Sony Liv Show

మా ఇంటి బంగారం సినిమా ఈవెంట్‌లో ఇక ముందు ఎక్కువగా బ్రేక్ తీసుకోవద్దు అంటూ అభిమానులు కోరగా.. సారీ.. మరోసారి నాకు కెరీర్ పరంగా బ్రేక్ రానున్నది. నేను మెటర్నిటీ లీవ్‌లో వెళ్తున్నాను. ఈ బ్రేక్ తప్పదు అంటూ తన ప్రెగ్నెన్సీ వార్తను ఆమె కన్ఫర్మ్ చేశారు. అయితే బ్రేక్ ఆలోచనలో ఉన్న ఆమెకు సోనీ లైవ్ సంస్థ భారీ ఆఫర్‌ను ముందుంచడంతో ఓప్పుకోక తప్పలేదు అని అంటున్నారు.

అయితే ఓటీటీ ప్రపంచంలోకి సమంత ఇప్పటీకే అడుగుపెట్టింది. గతంలో ఆహాలో రియాలిటీ షో సామ్ జామ్ చేయడం తెలిసిందే. అలాగే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో డిజిటల్ మీడియా ఆడియెన్స్‌కు పరిచయం అయ్యారు. ప్రస్తుతం సోనీ లివ్ రూపొందించే సెలబ్రిటీ టాక్ షోకు ఆమె హోస్ట్‌గా కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఈ మేరకు చెన్నైలో జరిగే ప్రీ ప్రొడక్షన్ పనులు, ఇతర వ్యవహారాల్లో ఆమె బిజీగా ఉంటూ కనిపిస్తున్నారు.

అయితే సోనీ లివ్ రూపొందించే సెలబ్రిటీ టాక్ షో కోసం భారీగా రెమ్యునరేషన్ అందుకోబోతున్నారనే వార్త సినీ వర్గాల్లోను, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కొన్ని వారాలపాటు సాగే ఈ టాక్ షోకు సంబంధించి ప్రతీ ఎపిసోడ్‌కు సుమారుగా 1 కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకొనున్నారనే విషయం చర్చనీయాంశమైంది. అదే జరిగితే బ్రేక్ సమయంలోను సమంత తన క్రేజ్‌ను ఆదాయం రూపంలో మార్చడమే కాకుండా భారీగా పారితోషికాన్ని అందుకోవడం స్పష్టమైంది.

ఇదిలా ఉండగా, సమంత తాజాగా తమ సొంత బ్యానర్‌ ట్రాలాలా పిక్చర్స్‌లో మా ఇంటి బంగారం సినిమాలో నటించడం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్‌ను భారీగా అందుకొన్నారు. ఈ సినిమా బిజినెస్‌లో వాటా మాత్రమే కాకుండా సుమారుగా 7 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకొన్నట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఏది ఏమైనా సమంత తన స్టార్ స్టామినాతో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X