సమంత యూటర్న్.. ఆ నిర్ణయం వెనక్కి తీసుకుందా?
ఇటీవల కొన్ని రోజులు నుంచి తెలుగు సినిమా దగ్గర మంచి హాట్ టాపిక్ గా వినిపించిన ఎన్నో అంశాల్లో మన తెలుగు సినిమా టాప్ హీరోయిన్ సమంత కోసం కూడా చాలా అంశాలే ఉన్నాయని చెప్పాలి. కాగా సమంతపై సినిమాలు అటు వెబ్ సిరీస్ లు సహా తన పర్శనల్ లైఫ్ కి సంబంధించి కూడా ఊహించని వార్తలే వినిపిస్తూ వచ్చాయి. కాగా ఇలా సామ్ అనేక రకాలుగా ట్రెండింగ్ లో నిలిచింది.
ఇక రీసెంట్ గానే సమంతపై మరో ఇంట్రెస్టింగ్ రూమర్ అయితే వైరల్ గా మారింది. సమంత సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గానే స్టార్ట్ అయ్యి సోలోగా ఆమెపై సినిమాలు చేసుకునేవరకు ఎదిగిన సంగతి తెలిసిందే. కానీ మధ్యలో మాత్రం ఊహించని విధంగా ఒక ఐటెం సాంగ్ లో కనిపించి పాన్ ఇండియా సినిమాని షేక్ చేసి పారేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 1 లో సమంత ఈ సాంగ్ ని చేసింది.

అయితే ఈ సాంగ్ ఆమె విడాకులు తీసుకున్నాక చేయడం అది కూడా ఊహించని లెవెల్ హాట్ నెస్ తో చేయడం అనేది పెద్ద ఎత్తున చర్చకు కూడా దారి తీసింది. ఇక ఆ తర్వాత సామ్ ఇతర సినిమాలు సహా వెబ్ సిరీస్ లు మధ్యలో తన ఆరోగ్యం కూడా బాగోకపోవడం ఇలా పలు కారణాలు అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఇపుడు మళ్ళీ సినిమా వెబ్ సిరీస్ లు అంటూ బిజీ అయ్యింది.
ఇదిలా ఉండగా అప్ప్పుడు పుష్ప 1 లో సెన్సేషనల్ గా మారిన సామ్ మరోసారి పుష్ప రాజ్ కోసం రాబోతుంది అంటూ ఓ టాక్ మొదలైంది. అయితే ఇక్కడే ఇంట్రెస్టింగ్ గా ఆమె ఇచ్చిన ఓల్డ్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది. పుష్ప 1 సినిమా 2021 లో వచ్చింది. కానీ ఈ ఏడాదిలోనే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒక తాను ఐటెం సాంగ్స్ ని చేసేది లేదు అంటూ చెప్పేసింది.

కానీ ఇపుడు జోరుగా సామ్ పార్ట్ 2 కోసం మరోసారి ఐటెం గర్ల్ గా మారుతుంది అంటూ రూమర్స్ ఊపందుకున్నాయి. సో ఈ ఏడాదిలోనే ఇచ్చిన మాట తప్పిందా అనేది ఒకటి వినిపిస్తుండగా ఇదే కామెంట్స్ లో తన రిలేషన్ షిప్ స్టేటస్ కోసం చెప్పడం కూడా అటెన్షన్ తెచ్చుకుంది. కాగా ఆమెకి మీరు లైఫ్ లాంగ్ ఇలాగే సింగిల్ గా ఉంటారా అనే ప్రశ్నకి 'ఊహూ' అంటాను అంటూ సమాధానం ఇచ్చింది.
అంటే సామ్ ఫ్యూచర్ లో సింగిల్ గానే మిగిలిపోదు అనేది కూడా కన్ఫర్మ్ అయ్యింది. మరి ఆమెకి కూడా రెండో పెళ్లి ఆలోచనలు ఉన్నాయా లేదా వేరే రకంగా సింగిల్ గా ఉండకుండా ఉండేందుకు ప్లానింగ్ చేసుకుంటుందా అనేది భవిష్యత్తులో తేలుతుంది. సో మొత్తానికి అయితే పుష్ప 2 లో ఐటెం సాంగ్ నేపథ్యంలో వెలుగులోకి వచ్చి వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











