నన్ను సెకండ్ హ్యాండ్ అన్నారు .. విడాకుల తర్వాత షాకింగ్ నిజాలు బయటపెట్టిన సామ్
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి మోస్ట్ ఫెవరెట్ జంటలలో టాలీవుడ్ అడోరబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ జంట అక్కినేని నాగ చైతన్య అలాగే సమంతల జంట కూడా ఒకటి. తమ మొదటి చిత్రం "ఏమాయ చేసావే" నుంచే ఇద్దరు ప్రేమలో పడి అక్కడ నుంచి ఫైనల్ గా ఇరు కుటుంబాల సమ్మతంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
అక్కడ నుంచి ఎంతో మందికి బాగా ఇష్టమైన కపుల్ గా వీరు నిలిచారు. కానీ ఏమైందో ఏమో కానీ వీరి నుంచి ఊహించని విధంగా విడాకుల వార్త మాత్రం తమ అభిమానుల మనసులు ముక్కలు చేసి వారిని కూడా రెండు భాగాలుగా విడిపోయేలా చేసింది. ఇక్కడి నుంచి సమంత, నాగ చైతన్య ఇద్దరూ ఎవరికి వారు వేరైపోయారు. ఆ తర్వాత నుంచి తమ సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ బిజీగా మారగా తమ విడాకుల విషయంలో మాత్రం ఎప్పుడు స్పందించలేదు.

కానీ ఈ మధ్య మాత్రం చాలా సార్లు వీరి గురించి వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కాగా.. సమంత అండ్ అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన కామెంట్స్, ఆ తర్వాత నాగ చైతన్య రెండో పెళ్లి వార్తలు.. అలాగే మొన్ననే నాగ చైతన్య విషయంలో సమంత చేసిన పలు కామెంట్స్ లాంటివి షాకింగ్ గా మారి వైరల్ అయ్యాయి.
అయితే ఇవి కాకుండా లేటెస్ట్ గా సమంత నేషనల్ మీడియాలో చేసిన పలు షాకింగ్ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. కాగా తనకే కాదు విడాకులు తర్వాత ఏ ఆడపిల్ల లైఫ్ సాఫీగా సాగదని ఎన్నో అవమానాలు, ట్రోల్స్ కామెంట్స్ వస్తాయని చెప్పుకొచ్చింది. అలానే నాకు కూడా విడాకులు తర్వాత ఎన్నో మాటలు ఎదురయ్యాయి అని చెప్పుకొచ్చింది.
నేను సెకండ్ హ్యాండిల్, ఆల్రెడీ వాడేసిన దానిని, ఒక వేస్ట్, పనికిరాని దానిని అంటూ ఎన్నో దారుణమైన కామెంట్స్ ని నేను ఎదుర్కొన్నాను అని సామ్ సంచలన నిజాలు బయట పెట్టారు. అలాగే తమ వెడ్డింగ్ గౌన్ అంటే ఎంతో స్పెషల్, అందుకే దానిని అలానే ఉంచుకోకుండా వేరేలా డిజైన్ చేయించుకున్నాను అని సామ్ తెలిపింది. దీనితో తన విడాకుల అనంతరం ఎదుర్కొన్న పరిస్థితులపై సామ్ చెప్పిన షాకింగ్ నిజాలు ఇపుడు వైరల్ గా మారాయి.
ఇక రీసెంట్ గానే సమంత నుంచి భారీ పాన్ ఇండియా వెబ్ సిరీస్ "సిటాడెల్ హనీ బన్నీ" రిలీజైంది. ఇది కాకుండా హిందీలోనే తుంబాడ్ దర్శకుడు అనీల్ రాహి బార్వేతో భారీ సిరీస్ "రక్త బ్రహ్మాండ్" చేస్తుంది. ప్రస్తుతానికి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాతుకుపోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు సమంత. తెలుగులో మాత్రం మరో సినిమా చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి ఎలాంటి టాక్ లేదు. ఆమె ఆల్రెడీ అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం కూడా ఎలాంటి ప్రోగ్రెస్ లో లేనట్టే కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











