'విడాకుల్లో నా తప్పేమి లేదు.. చైతూతో పెళ్ళికి 100 శాతం న్యాయం చేశా’

అక్కినేని వారసుడు నాగచైన్య, అగ్రనటి సమంతలు సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకుని కొద్దికాలానికే విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత నాగచైతన్య, సమంతలు తమ జీవితాల్లోకి మరో వ్యక్తిని ఆహ్వానించారు. దాదాపు ఐదేళ్లు కావొస్తున్నా వీరి విడాకుల ఇష్యూ ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్యతో విడాకులపై సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాయ చేశావే సినిమాలో సమంత- నాగచైతన్య కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేశారు. అనంతరం పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలెక్కింది. 2017 అక్టోబర్ 6, 7 తేదీలలో గోవాలో సమంత - నాగచైతన్యల వివాహం ఘనంగా జరిగింది. హిందూ, క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సమంత- నాగచైతన్యలు తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. కలిసి షాపింగ్ చేయడం, ఇంట్లో వంట, ఇతర పనులకు సంబంధించిన ఫోటోలను ఇద్దరూ పంచుకునేవారు.

Samantha Opens Up on Divorce with Naga Chaitanya Responds to Pushpa Song Controversy

కానీ ఏం జరిగిందో ఏమో కానీ సమంత - నాగచైతన్యల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. తన సోషల్ మీడియా ఖాతాలలో అక్కినేని ఇంటి పేరును తొలగించడంతో పాటు చైతూను అన్‌ఫాలో కావడం, ఇద్దరూ కలిసున్న ఫోటోలు డిలీట్ చేయడం తదితర అంశాలు ఈ వార్తలకు బలం చేకూర్చాయి. చివరికి 4 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెబుతూ 2021లో సమంత - నాగచైతన్యలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అయితే ఈ విడాకులకు దారి తీసిన కారణాలు ఏంటీ అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. కానీ మీడియాలో మాత్రం రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి.

విడాకుల తర్వాత ఇద్దరూ కొన్నేళ్లపాటు ఒంటరిగానే జీవితాన్ని కొనసాగించారు. సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారినపడి దాని నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ శోభిత ధూళిపాళతో ప్రేమలో పడిన చైతన్య.. పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఇక సమంత విషయానికి వస్తే.. తెలుగు మూలాలున్న బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడి గతేడాది డిసెంబర్‌లో ఆయనను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ వారి వారి సినిమాలు, వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్నారు.

అయితే నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత నిర్ణయాలపై ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా అల్లు అర్జున్ - సుకుమార్‌ల కాంబోలో తెరకెక్కిన పుష్ప ది రైజ్‌లో సమంత ఐటెం సాంగ్ చేశారు. ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా అంటూ సాగే ఈ సాంగ్ తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశాన్ని ఊపేసింది. దేవిశ్రీప్రసాద్ మాస్ బీట్స్‌కు తోడు సమంత అందాలు, అల్లు అర్జున్ డ్యాన్స్‌తో మాస్ ఆడియన్స్ వెర్రెక్కిపోయారు. కొన్నేళ్ల పాటు ఈ సాంగ్ యూట్యూబ్‌లో నెంబర్‌వన్‌గా ట్రెండ్ అయ్యింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఈ స్పెషల్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కలకలం రేపింది. అలాగే ఈ సాంగ్‌పై ట్రోలింగ్ దారుణంగా జరిగింది.

దీనికి అప్పట్లోనే సమంత క్లారిటీ ఇచ్చారు. నేను చైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడం వల్లే నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ పాట చేయొద్దని సలహా ఇచ్చారని తెలిపింది. అయినా నేను ఏ తప్పు చేయలేదు, నా పెళ్లికి 100 శాతం న్యాయం చేశా, దురదృష్టవశాత్తూ అది వర్కవుట్ కాలేదు. నన్ను ఇంట్లో కూర్చోమన్నారు.. ఇంట్లోనే కూర్చోనేంత నేరం నేను చేయలేదు. నేను జీవితంలో ఇంతకుముందు ఐటెం సాంగ్ చేయలేదు. పాట నచ్చడం వల్లే అందరూ చేయకూడదని చెప్పినా పుష్ప పాట చేశానని సమంత తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X