ఆ విషయంలో గొప్పగా ఫీల్ అవుతారా?.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
సమంత ప్రస్తుతం రైతుగా మారిన సంగతి తెలిసిందే. అర్భన్ ఫార్మింగ్ ఊపందుకున్న వేళ సమంత కూడా అదే దారిలో వెళ్తోంది. ప్రస్తుతం దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకుంటోంది. సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మెలుకువలు నేర్చుకుంటోంది. ఈ మేరకు తన బంగ్లాపై ఓ తోటనే పెంచుతోంది. ఇంట్లోనే అన్ని రకాల మొక్కలను, కూరగాయలను పండిస్తోంది.
ఆ మధ్య మొక్కలకు నీరు పడుతూ, తన పంటను జాగ్రత్తగా చూసుకుంటున్న ఫోటోలను షేర్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇంట్లో పండించిన వాటితోనే వంటను వండుతోంది. కొత్త వంటలను కూడా సమంత ఎంతో శ్రద్దగా నేర్చుకుంటోంది. దీని కోసం ప్రత్యేకంగా ఓ టీచర్‌ను కూడా నియమించుకుంది. అయితే తాజాగా సమంత ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చింది.

మనుషులు ఎందులో పవర్, గొప్ప, శక్తిని ఫీలవుతారని చెబుతూ.. డబ్బు, స్టేటస్, టమాటలను పండించడం అంటూ గ్రాఫ్‌ను పోస్ట్ చేసింది. అందులో టమాటలను పండించడానికి ఎక్కువ మంది ఓటు వేసినట్టు చూపిస్తోంది.
అయితే సమంత దీన్ని బట్టి రైతులు గొప్పఅని చాటిచెబుతున్నట్టు కనిపిస్తోంది. స్వయంగా సమంత కూడా పంటలు పండిస్తుండటమే దీనంతటికి కారణమై ఉంటుంది. సమంత ప్రస్తుతం సినిమా ప్రపంచాన్ని పక్కన బెట్టి ఈ సమయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎంత సేపు మొక్కలతోనో, తన పెంపుడు జంతువులతోనో సమయాన్ని గడుపుతోంది.


Click it and Unblock the Notifications











