Samantha శ్రీ కాళహస్తిలో పూజలు.. ఎలాంటి హోమం, అభిషేకం జరిపించారంటే!.. గతంలో సిద్ధార్థ్‌తో.. ఇప్పుడు!

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ఇప్పుడు మీడియా హెడ్‌లైన్స్‌ను ఆకర్షించడమే కాకుండా వార్తల్లో వ్యక్తిగా అత్యంత చర్చనీయాంశం అవుతున్నారు. ఆమెకు సంబంధించిన వ్యవహారాలు వివాదంగా కూడా మారుతున్నారు. తన జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనలు కారణంగా ఆమె ఇప్పుడు అధ్యాత్మిక జీవితంపైపు ప్రయాణిస్తున్నారనే విషయం మరింత ఆసక్తిగా మారింది. ఈ వాదనకు బలం చేకూరేలా ఆమె హిందూ దేవాలయాలను దర్శించుకోవడం విశేషంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

నాగచైతన్యతో విడాకుల రూమర్లు

నాగచైతన్యతో విడాకుల రూమర్లు

నాగచైతన్య భార్యగా, అక్కినేని ఇంటి కోడలిగా సుపరిచితులైన సమంత అలియాస్ సమంత రుత్ ప్రభుపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకొని తన మకాంను ముంబైకి మార్చారనే ఊహాగానాలు మీడియాలో చెలరేగుతున్నాయి. అయితే ఈ విషయంలో గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ.. అధికారికంగా ఎవరూ నోరు విప్పకపోవడంతో ఈ వ్యవహారం అత్యంత ఆసక్తికరంగా మారింది.

శనివారం తిరుమలలో ప్రత్యక్షం

శనివారం తిరుమలలో ప్రత్యక్షం

నాగచైతన్యతో విడాకుల రూమర్ల నేపథ్యంలో సమంత తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొన్నారు. శనివారం శ్రీవారిని దర్శించుకొన్న తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్న తర్వాత సమంతను విడాకుల రూమర్లను ప్రస్తావించగా.. గుడికి వచ్చా.. బుద్ధి ఉందా అంటూ సమంత ఎమోషనల్‌గా సమాధానం ఇవ్వడం చర్చనీయాంశమైంది.

శ్రీ కాళహస్తిలో పూజల్లో నిమగ్నం

శ్రీ కాళహస్తిలో పూజల్లో నిమగ్నం

అయితే తిరుమల పర్యటనకు ముందు శుక్రవారం ఉదయమే సమంత శ్రీ కాళహాస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని భగవంతుడిని దర్శించుకొన్నారు. అనంతరం ఆమె నేరుగా తిరుమలకు చేరుకొని శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన్‌లో బాలాజీని దర్శించుకొన్నారు. అనంతరం ఆమె తిరుమల నుంచి శనివారం ఉదయమే శ్రీకాళహస్తికి చేరుకోవడం చర్చనీయాంశమైంది.

చండీ హోమం, శనీశ్వరస్వామికి అభిషేకం

చండీ హోమం, శనీశ్వరస్వామికి అభిషేకం

శ్రీకాళహస్తిలోని ఆలయంలో సమంత శనివారం ఉదయం చండీ హోమం నిర్వహించారు. గంటపాటు సాగిన ఆ పూజలో పాల్గొన్న తర్వాత శనీశ్వర స్వామి అభిషేకం జరిపించారు. ఈ అభిషేకం దాదాపు అర్ధగంట పాటు జరిగిందని తెలిసింది. అనంతరం ఆలయ నిర్వాహకులు సమంతకు శాలువా, ప్రసాదాలతో సత్కరించినట్టు సమాచారం. ఆ తర్వాత ఆమె చెన్నైకి బయలుదేరి వెళ్లిపోయారని అధికారులు వెల్లడించారు.

సమంత పూజలు ఎందుకంటే?

సమంత పూజలు ఎందుకంటే?

అయితే సమంత పూజలు, అభిషేకం జరిపించడం ఎవరికీ అంతుపట్టడం లేదు. నాగచైతన్యతో సంబంధాలు మెరుగు పడాలని పూజలు చేయించారని కొందరు అంటే.. విడాకుల తర్వాత తన జీవితం బాగా ఉండాలని, అంతా మంచి జరుగాలనే ఉద్దేశంతో పూజలు చేయించారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ పూజల వెనుక ప్రత్యేక కారణం ఏమి లేదని స్పష్టం చేస్తున్నారు.

Recommended Video

Sundeep Kishan Road Show | A1 Express విజయ యాత్ర
గతంలో సిద్ధార్థతో కలిసి సమంత పూజలు

గతంలో సిద్ధార్థతో కలిసి సమంత పూజలు

గతంలో అంటే సుమారు ఐదేళ్ల క్రితం సమంత శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దార్థ్‌తో పీకల్లోతు అఫైర్ ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. దాదాపు పెళ్లి వరకు వచ్చిన వారి బంధం మధ్యలోనే బ్రేక్ అయింది. 2017 జనవరి 15వ తేదీన సమంత కటుంబం, సిద్దార్థ్ కుటుంబం రాహుకేతు పూజను నిర్వహించారు. ఈ పూజల సందర్భంగా సిద్దార్థ్ తండ్రి అస్వస్థతకు లోనవ్వడం ఆ కుటుంబాలను ఆందోళనకు గురిచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X