సమంత డేటింగ్ రూమర్లకు చెక్.. చేతిలో చేయి వేసి అతడితో కలిసి క్లారిటీ

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు వ్యక్తిగత జీవితం మరోమారు మీడియాలో హాట్ టాపిక్‌గా మారడం అందరిలోను ఆసక్తిని పెంచింది. నాగచైతన్య రెండో వివాహం తర్వాత ఆమె పర్సనల్ లైఫ్‌పై సోషల్ మీడియా, జాతీయ మీడియా ప్రధానంగా దృష్టిపెట్టింది. అయితే సమంత మాత్రం తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కడ కూడా స్పందించకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది.

కానీ ఇటీవల కాలంలో ఆమె తన డేటింగ్ లైఫ్ గురించిన రూమర్లకు బలం చేకూరేలా లీకులు ఇస్తున్నాదా? అనే అనుమానం కలిగిస్తున్నది. తాజాగా ఆమె తన జీవితంలోకి వచ్చినట్టు మీడియా పేర్కొంటున్న బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ధైర్యంగా కలిసి రావడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ వివరాల్లోకి వెళితే..

Samantha Ruth Prabhu Photo with Raj Nidimore Trending Is Sam confirmed Relationship with The Family Man Director

సమంత రుత్ ప్రభుకు జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చిన సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఆమె సౌత్ నుంచి ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది. ఆ సమయంలోనే ఆమె వైవాహిక జీవితం ఓ భారీ కుదుపుకు లోనైంది. అందుకు కారణం ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అనే వార్త మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే ఆ సమయంలో ఆమె పెదవి విప్పలేదు. అంతలోనే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు.

అయితే ఇటీవల కాలంలో ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారనే రూమర్లు, గాసిప్ వార్తలు జాతీయ మీడియా, బాలీవుడ్ మీడియాలో గుప్పుమన్నాయి. అయినా తన పర్సనల్ లైఫ్ గురించి ఏ మాత్రం స్లిప్ కాకుండా జాగ్రత్తలు పడింది. నాగచైతన్య, శోభిత పెళ్లి తర్వాత తన రిలేషన్‌షిప్ విషయంలో ముందుకు వెళ్లారనే ఓ వార్త మీడియాలో గుప్పుమన్నది.

Samantha Ruth Prabhu Photo with Raj Nidimore Trending Is Sam confirmed Relationship with The Family Man Director

అయితే తాజాగా బాలీవుడ్ పత్రికలు సమంత రిలేషన్‌షిప్ గురించి భారీ చర్చను తెరపైకి తెచ్చింది. రాజ్ నిడుమోరుతో ఆమె రిలేషన్‌షిప్ మరో ముందడుగు వేసింది. వారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. వారిద్దరి మధ్య స్నేహం మరింత ముందుకు వెళ్లింది. వారిద్దరూ డేటింగ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారనే వార్తలు నేషనల్ మీడియాలో విస్తృతంగా కనిపించాయి.

కానీ ఇటీవల వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సమంత రుత్ ప్రభు తాను ఓనర్‌గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ ఛాంప్స్ జట్టును ప్రోత్సాహించేందుకు వచ్చారు. తన వెంట రాజ్ నిడిమోరును కూడా తీసుకు రావడంతో వారిద్దరి మధ్య వస్తున్న రూమర్లకు మరింత బలం చేకూరినట్టలయిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాకుండా రాజ్ చేతిని పట్టుకొని నడచి రావడం భారీ చర్చకు దారి తీసింది.

సమంత రుత్ ప్రభు తాజా తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టి రాజ్ నిడిమోరుతో ఉన్న ఫోటోను పోస్టు చేసింది. స్పోర్ట్స్ వరల్డ్‌లోకి నా తొలి అడుగు. పికిల్ బాల్ క్రీడతో అనుబంధం ఏర్పడింది. నాకు క్రీడలంటే అంతగా నచ్చదు. ఓటమి భయంతో నేను వాటికి దూరంగా ఉంటాను. కానీ పికిల్ బాల్‌ క్రీడతో అలా అనుబంధం ఏర్పడింది అని సమంత తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X