సమంత సెన్సేషన్: ఏ హీరోయిన్ చేయని విధంగా.. ప్రతి ఇంటికీ రాబోతున్న అక్కినేని కోడలు.!

By Manoj

అక్కినేని వారి కోడలు సమంత ఫుల్ ఫామ్‌లో ఉంది. కొన్నేళ్లుగా వరుస విజయాలు అందుకుంటున్న ఈ స్టార్ హీరోయిన్.. ప్రస్తుతం గోల్డెన్ డేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. 'ఏమాయ చేశావే' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సామ్.. కెరీర్ ఆరంభంలోనే అద్భుతమైన నటనతో మెప్పించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోల సరసన నటించింది. దీంతో చాలా కాలం పాటు బిజీ బిజీగా గడిపింది. కానీ, ఈ మధ్య ఆమె పెద్దగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్? వివరాల్లోకి వెళితే...

తెలుగు, తమిళంలో ఒక్కటే జోరు

తెలుగు, తమిళంలో ఒక్కటే జోరు

సమంత ఈ మధ్య ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ‘అ ఆ'తో మొదలైన ఆమె విజయాల పరంపర ‘జనతా గ్యారేజ్', ‘రంగస్థలం', ‘మహానటి', ‘యూటర్న్', ‘మజిలీ', ‘ఓ బేబీ' వరకూ కొనసాగుతూ వస్తోంది. తెలుగులోనే మాత్రమే కాదు.. తమిళంలోనూ సామ్ సత్తా చాటుతోంది. ఆమె నటించిన ‘మెర్సల్', ‘ఇరుంబుతిరై', ‘సూపర్ డీలక్స్' సూపర్ హిట్లుగా నిలిచాయి.

ఇప్పుడున్నది ఒక్కటే.. ఇంకోటి అక్కడ

ఇప్పుడున్నది ఒక్కటే.. ఇంకోటి అక్కడ

‘ఓ బేబీ' తర్వాత సమంత సినిమాలను తగ్గించేసింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘జాను' (96 రీమేక్) మాత్రమే విడుదలకు సిద్ధంగా ఉంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. దీనితో పాటు సామ్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ మీడియా రంగంలోకి అడుగు పెడుతోంది. ఇందులో ఆమె నెగెటివ్ రోల్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.

సినిమాలు లేవు.. తల్లి కాబోతుంది

సినిమాలు లేవు.. తల్లి కాబోతుంది


సమంత ఈ మధ్య పెద్దగా సినిమాలు ఒప్పుకోకపోవడంతో ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె త్వరలోనే తల్లి కాబోతుందని, అందుకే సినిమాలకు దూరం కాబోతుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై ఇటీవల సామ్ కూడా వ్యంగ్యంగా స్పందించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.

భర్తతో కలిసి సమంత సూపర్ ప్లాన్

భర్తతో కలిసి సమంత సూపర్ ప్లాన్


ఇటీవల సమంత గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆమె తన భర్త నాగ చైతన్యతో కలిసి ఓ వ్యాపారాన్ని ప్రారంభించబోతుందన్నదే ఆ వార్త సారాంశం. అయితే, ఆ వ్యాపారం దేనికి సంబంధించింది అన్నది మాత్రం బయటకు రాలేదు. కానీ, ఈ విషయంపై త్వరలోనే భార్య భర్తలిద్దరూ కలిసి ప్రకటన చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ప్రతి ఇంటికీ రాబోతున్న అక్కినేని కోడలు.!

ప్రతి ఇంటికీ రాబోతున్న అక్కినేని కోడలు.!

తాజాగా అక్కినేని వారి కోడలు సమంత గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం... సామ్ త్వరలోనే ఓ టాక్ షో ద్వారా తెలుగు బుల్లితెరలోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. వారం వారం వచ్చే ఈ షో ద్వారా ప్రతి ఇంటిని ఆమె పలకరించబోతుందని అంటున్నారు. అయితే, ఇది ఏ చానెల్‌లో, ఎప్పుడు వస్తుంది.? అన్నది తెలియాల్సి ఉంది.

సమంత కోసం ఎవరు వస్తున్నారు.?

సమంత కోసం ఎవరు వస్తున్నారు.?

సమంత టాక్ షోను హోస్ట్ చేయబోతుందన్న వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఎన్నో అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ షో ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకు వస్తారని కొందరు అంటుండగా.. సెలెబ్రిటీల మనసులోని మాటలను బయటకు తీసుకు వస్తుందని మరికొందరు చెబుతున్నారు. దీంతో సమంత షోకు సంబంధించిన ప్రకటనపై ఆసక్తి పెరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X