ఆ వయసులో తల్లి అయితే కష్టమే.. మాతృత్వంపై సమంత కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.ఇటీవల ఆమె నటించి, నిర్మించిన లెటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా సక్సెస్ చేస్తున్న సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఓ ఈవెంట్ సమంత కాస్త బేబీ బంప్ ఉన్నట్టు కనిపించడంతో సమంత తల్లి కాబోతున్నారా? సమంత - రాజ్ దంపతులు త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? అనే రూమర్స్ క్రియేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సమంతకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఇంతకీ వీడియో ఏంటీ? అందులో సామ్ ఏమన్నారంటే?

సమంత, నందినీ రెడ్డి కాంబో తెరకెక్కిన మూడో సినిమా 'మా ఇంటి బంగారం'. ఈ సినిమా శుక్రవారం (జూన్ 19) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకి ప్రముఖ మేకర్,సమంత భర్త రాజ్ నిడిమోరు కథను అందించారు.ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా మంచి ఓపెనింగ్స్ సాధించింది.కేవలం ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ మా ఇంటి బంగారానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. దీంతో తొలిరోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 13 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతే కాదు.. ఓపెనింగ్ కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ దాటేసినట్టు తెలుస్తోంది.

Samantha Pregnancy Rumours Go Viral Old Comments About Motherhood Resurface

ఇలా భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో మూవీ మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ సమయంలో సమంత లుక్‌లో తేడా ఉందని, ఆమె బేబీ బంప్ తో కనిపించిందనీ రూమర్స్ క్రియేట్ అయ్యాయి. దీంతో "సమంత తల్లి కాబోతుందా? త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా?'అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు సమంత గానీ, ఆమె అధికారిక బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు ఆధారంగా మాత్రమే ఈ ప్రచారం సాగుతోంది. అధికారిక ధృవీకరణ లేకపోవడంతో ప్రస్తుతం ఇవన్నీ ఊహాగానాలుగానే పరిగణించాలి.

ఈ నేపథ్యంలో సమంతకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఇందులో ఆమె మాతృత్వం, పిల్లల పెంపకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కుటుంబం, పిల్లల గురించి తన ఆలోచనలను ఎంతో స్పష్టంగా చెప్పింది. ఆ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. తనకు చిన్న వయసులోనే పిల్లలను కనాలని ఎప్పటినుంచో అనిపించేదని చెప్పింది. 30 నుంచి 35 సంవత్సరాల మధ్య పిల్లలు పుడితే మంచిదని వెల్లడించింది. పాప అయినా, బాబు అయినా తనకు ఎలాంటి తేడా లేదన్నారు.

అలాగే పిల్లలతో గడిపే సమయం ఎంతో విలువైనదని సమంత అన్నారు. 'నా కూతురికి 15 ఏళ్లు వచ్చినప్పుడు నేను 60 - 70 ఏళ్ల వయసులో ఉంటే అది అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు. ఆమె 'మమ్మీ.. మనం కలిసి ఆడుకుందాం' అని పిలిచినప్పుడు, ఆమెతో పరుగులు తీయలేకపోవడం లేదా అలసిపోవడం నాకు ఇష్టం ఉండదు. పిల్లలతో వారి వయసుకు తగ్గట్టుగా గడపగలగాలి'అని చెప్పింది. అంతేగాని, తనతో ఆడుకోలేక ఆయాస పడడం అంత బాగోదు. అప్పుడు నా కూతురు నన్ను కాకుండా ఇంకెవరినో మమ్మీ అనాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రావద్దని, ఎర్లీ స్టేజిలోనే కనేయాలని ఫిక్స్ అయ్యా'' అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. సమంత చేసిన ఓల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. అలాగే విషెస్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X