Don't Miss!
- Sports
అతన్ని ఆర్సీబీ అనవసరంగా రిటైన్ చేసుకుంది: పార్థీవ్ పటేల్
- News
బీజేపీ కోసం తెలంగాణలో పవన్‌కల్యాణ్ రాజకీయం??
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సమంత పుష్ప ఐటెమ్ సాంగ్ ప్రాక్టీస్.. ఒరిజినల్ కంటే ఘాటుగా.. సెక్సీ స్టెప్పులు!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా సమంత చేసిన మొట్టమొదటి ఐటమ్ సాంగ్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెగ్యులర్ హీరోయిన్ గా చాలా బిజీగా ఉండే సమంత డిఫరెంట్ గా ఉంటుంది అని చాలా ఘాటైన స్పెషల్ సాంగ్ తో రావడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఊ అంటావా మావా.. అనే ఆ పాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా దేవి మ్యూజిక్ ఇవ్వగా సమంత డ్యాన్స్ తో షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. అయితే ఈ పాట ఒరిజినల్ కంటే కూడా ఇటీవల సమంత ప్రాక్టీస్ చేసిన వీడియో సోషల్ మీడియా లో ఎక్కువావ్ వైరల్ అవుతోంది.

కెరీర్ పై మరింత ఫోకస్
నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టినట్లుగా అర్థమవుతోంది. కేవలం రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాటు గ్లామరస్ రోల్స్ చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నట్లుగా అర్థమవుతుంది. కేవలం ఒక తరహా పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని రకాలుగా ట్రై చేయాలని ఫిక్స్ అయినట్లుగా క్లారిటీ వచ్చేసింది.

గతంలో ఆఫర్స్ వచ్చినా..
సమంత అక్కినేని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తున్నా మొన్నటివరకు స్పెషల్ సాంగ్స్ అయితే చేయలేదు. చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ ఐటమ్ సాంగ్స్ సమంత చేసింది లేదు. ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్స్ చాలావరకు ఐటెం సాంగ్స్ రిజెక్ట్ చేయడం లేదు. కానీ సమంత మాత్రం గతంలో చాలా సార్లు రిజెక్ట్ చేసింది. ఫైనల్ గా సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో మాత్రం ఆమె ఊహించని విధంగా ఐటెమ్ సాంగ్ చేసి కిక్ ఇచ్చింది..

అందరి ఫోకస్ సామ్ పైనే..
ఉ అంటావా ఉఊ ఉంటావా అనే పాటలో సమంత గ్లామర్ డోస్ ఏ స్థాయిలో క్లిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పాటలో అల్లు అర్జున్ ఉన్నప్పటికీ కూడా అందరి ఫోకస్ కూడా సమంత పైనే పడింది. కేవలం తెలుగులోనే కాకుండా దాదాపు అన్ని భాషల్లో కూడా స్పెషల్ పాటకు మంచి క్రేజ్ వచ్చింది.
మరింత సెక్సీగా ప్రాక్టీస్
అయితే సమంత ఆ పాట చేయడానికి కంటే ముందు చాలా ప్రాక్టీస్ చేసినట్టుగా కూడా అర్థం అవుతోంది. ఇటీవల తన జిమ్ లో సమంత ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఫిట్నెస్ డ్రెస్ లో లో సమంత మరింత సెక్సీగా చాలా అందంగా స్టెప్పులు వేస్తున్నట్లుగా నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

100 మిలియన్లకు పైగా
ఆ
పాట
ఎందుకు
అంత
సక్సెస్
అయ్యిందో
ఇప్పుడు
అర్థం
అయిందని
సమంత
డాన్స్
ప్రాక్టీస్
చేసిన
వీడియోలు
కూడా
సోషల్
మీడియాలో
షేర్
చేసుకుంటున్నారు.
ఇందుకు
సంబంధించిన
స్క్రీన్
షాట్స్
కూడా
వైరల్
అవుతున్నాయి.
మొత్తానికి
సమంత
పుష్ప
ఐటమ్
సాంగ్
యూట్యూబ్
లో
100
మిలియన్ల
వ్యూవ్స్
కు
పైగా
అందుకుని
సరికొత్త
రికార్డును
క్రియేట్
చేసింది.

భారీగా ఖర్చు చేసిన నిర్మాతలు
పుష్ప సినిమాలో ప్రతి పాట కూడా మంచి క్రేజ్ అందుకుంది. ముఖ్యంగా ఐటెం సాంగ్ అయితే అంత స్పెషల్ గా ఉండడానికి కారణం నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. ఆ పాట కోసం దాదాపుగా ఐదు కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. సమంత పారితోషికమే రెండు కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఆ పాట చిత్రీకరణ కోసం కూడా భారీ సెట్లు వేశారు.