సమంత కోసం కోటి మంది సైన్యం.. సరికొత్త రికార్డుతో
సోషల్ మీడియాలో సమంత ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం పోస్ట్‌లు చేయడమే కాకుండా ఫ్యాన్స్ కామెంట్లకు, ట్రోల్స్, మీమ్స్‌కు స్పందిస్తూ ఉంటుంది. సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మాత్రం గతంలో మాదిరి యాక్టివ్‌గా ఉండటం లేదు. లాక్ డౌన్ కాలంలో సెలెబ్రిటీలంతా ఖాళీగా ఉంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటే సమంత మాత్రం సైలెంట్‌గా ఉంటూ వస్తోంది.
రీసెంట్‌గా మళ్లీ అప్‌డేట్స్ ఇస్తూ హల్చల్ చేస్తోంది. ఈ మధ్య రానా మిహీక రోకా ఈవెంట్‌లో నాగచైతన్య-సమంత ఎంత అట్రాక్ట్‌గా నిల్చారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా సమంత తన భర్త గురించి చేసిన కామెంట్ కూడా తెగ వైరల్ అయింది. స్టైల్‌గా రెడీ అయిన చైతూ ఫోటోను షేర్ నా భర్త ఎంత అందంగా ఉన్నాడో కదా అంటూ ఎక్కడో గొయ్యి తీస్తున్నాడంటూ ఓ సెటైర్ వేసింది. తాజాగా సమంత మరో పోస్ట్ చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమాన గణం మైల్ స్టోన్‌కు చేరుకుంది. ఫాలోవర్ల సంఖ్య పది మిలియన్లకు చేరుకోవడంతో పట్టలేని సంతోషంలో సమంత మునిగిపోయింది. ఈ విషయాన్ని చెబుతూ ఈ సందర్భంగా పది ఎన్జీవోలకు సాయం చేస్తానని ప్రకటించింది. అయితే ఇన్‌స్టా ఫాలోవర్స్ లిస్ట్ తీస్తే కాజల్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్ల కంటే సమంత వెనకాలే ఉంది. అయితే వీరిద్దరు కూడా నార్త్‌లో బాగా ఫేమస్ కావడంతోనే ఫాలోవర్స్ సంఖ్య అంతలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫేస్‌బుక్‌లో సమంతకు దాదాపు 9 మిలియన్లు, ట్విట్టర్‌లో 8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.


Click it and Unblock the Notifications











