Samantha: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ రిలేషన్ పై సమంత ట్వీట్.. నేను అలా అనలేదంటూ!
ఏ మాయ చేశావే అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత. అనతి కాలంలోనే వరుస పెట్టి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక ఈ సినిమాతోనే నాగ చైతన్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. వివాహ బంధానికి దారి తీసింది.
కానీ నాలుగేళ్లకే వీరి బంధం ముగిసిపోయి విడాకులవరకు వెళ్లింది. తర్వాత చైతూ, సామ్ ఎవరి దారి వారి చూసుకున్నారు. ఈ సమయంలోనే మరో హాట్ బ్యూటి శోభిత ధూలిపాళతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు జోరుగా ప్రచారం అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై సమంత స్పందించింది. సామ్ ఏమన్నదనే వివరాలోకి వెళితే..

హిట్ కొట్టిన సినిమా..
అక్కినేని నాగ చైతన్య హీరోగా హిట్ కొట్టిన ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటి సమంత.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇక పుష్ప సినిమాలో ఊ అంటావా మావా అనే ఐటమ్ సాంగ్ తో నేషనల్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుస పెట్టి బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు రావడం మొదలైంది. గతేదాడి యశోదతో సాలిడ్ హిట్ కొట్టింది.

ఎపిక్ మైథాలాజికల్..
ఇప్పుడు మరో లేడీ ఒరియెంటెడ్ మూవీ శాకుంతలం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది బ్యూటిఫుల్ సమంత. ఎపిక్ మైథాలాజికల్ మూవీగా వస్తున్న శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించారు.

తెలుగులో రెండు కాకుండా..
శాకుంతలం సినిమా మాత్రమే కాకుండా ఫిట్ నెస్ సుందరి సమంత రూతు ప్రభు ఖుషీ అనే సినిమా కూడా చేస్తోంది. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న విషయం తెలిసిందే. మజిలి సినిమాను డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లవ్ స్టోరీగా రానుంది. తెలుగులో ఈ రెండు చిత్రాలు మాత్రమే కాకుండా హాలీవుడ్ లో కూడా నటిస్తోంది ఈ చిన్నది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ సిరీస్ ఇండియన్ వెర్షన్ ను సమంత చేయనుంది.

ప్రేక్షకులకు షాక్..
ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వెబ్ సిరీసుల ద్వయం రాజ్ అండ్ డీకే సిటాడెల్ భారతీయ వెర్షన్ ను డైరెక్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్యతో సమంత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. చైసామ్ విడిపోయి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఎవరూ ఊహించని విధంగా వీళ్లిద్దరు విడిపోయి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. అప్పుడు వీరి విషయంలో ఎంతో నెగెటివ్ ట్రోలింగ్ ను ఎదుర్కొంది సామ్.

ప్రవర్తన మార్చుకుంటే..
నాగ చైతన్యతో సమంత విడిపోయినప్పుడే వివిధ రకాలు రూమర్స్ వచ్చాయి. హీరోయిన్ శోభిత ధూళిపాళతో చైతూ డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు జోరందుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి డేటింగ్, రిలేషన్ పై సమంత కామెంట్స్ చేసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
"ఎవరు ఎవరితో రిలేషన్ లో ఉన్నారనే దానిపై నేను బాధపడటం లేదు. అయితే ప్రేమ విలువ తెలియని వారు ఎంతమందితో డేటింగ్ చేసినా వారికి కన్నీళ్లే మిగులుతాయి. కనీసం ఆ అమ్మాయైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆ అమ్మాయిని బాధపెట్టకుండా ఆయన తన ప్రవర్తనను మార్చుకుంటే అది అందరికీ బాగుంటుంది" అని సమంత చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి.
నా తప్పు మాత్రం లేదు..
సమంత అలా అన్నట్లుగా వార్తలు వైరల్ కావడంతో వాటిపై తాజాగా రియాక్ట్ అయింది సామ్. ఆ న్యూస్ ను షేర్ చేస్తూ.. "నేనెప్పుడు అలా చెప్పలేదు" అని తాజాగా ట్వీట్ చేసి షాక్ ఇచ్చింది సమంత. అంటే నాగచైతన్య, శోభిత రిలేషన్స్ పై సామ్ కామెంట్స్ అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది. ఇలా ఒక్క ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేసింది ఈ బ్యూటిఫుల్. అయితే విడాకుల విషయంలో తన తప్పు లేదని సమంత ఓ ఇంటర్వ్యూలో మాత్రం పేర్కొంది.


Click it and Unblock the Notifications











