సమంతకు అరుదైన గౌరవం.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆ దేశం నుంచి ఆహ్వానం

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న గ్లామరస్ బ్యూటిల్లో సమంత రూతు ప్రభు ఒకరు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలతో జత కట్టింది. స్టార్ హీరోయిన్ రేంజ్ ను ఇప్పటికీ కొనసాగిస్తూ హవా చాటుతోంది. త్వరలో ఖుషి సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిన ఈ క్యూటి ప్రస్తుతం అయితే చిత్రాలకు బ్రేక్ ఇచ్చి వేకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈ యాపిల్ బ్యూటికి అరుదైన గౌరవం దక్కింది. అదేంటనే వివరాల్లోకి వెళితే..

సైన్ చేసిన సినిమాలు: స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆమె నటించిన ఖుషి (Kushi 2023) మాత్రం సెప్టెంబర్ 1న విడుదలకు రెడీగా ఉంది. అయితే సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి ముందే తాను అగ్రిమెంట్ కు ఒప్పుకున్న సినిమాలన్నింటిని పూర్తి చేసింది సమంత. వాటిలో భాగంగానే ఖుషి విడుదల కానుంది.

Samantha

పూర్తి చేసి: ఖుషి కంటే ముందు హిట్లు ప్లాపులు తేడా లేకుండా ఏదో ఒక చిత్రం చేస్తూ ఫుల్ బిజీగా ఉండేది బ్యూటిఫుల్ సమంత. ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేసి ఆకట్టుకుంది. కానీ, అందులో యశోద మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. శాకుతంలం మాత్రం ఊహించని విధంగా పరాజయం పాలైంది. సమంత ఇప్పటికే రెండు మూడు చిత్రాలను పూర్తి చేసింది.

సైన్ చేయని సామ్: ముందుగా చెప్పుకునన్నట్లే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ పై ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ది చెన్నై స్టోరీ మూవీ సామ్ చేసిందా లేదా అనేదానికి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వీటి తర్వాత ఎలాంటి సినిమాకు సైన్ చేయలేదు బ్యూటిఫుల్ సమంత.

Samantha

నిజంగానే అమెరికాకు: ప్రస్తుతం సామ్ ఇండోనేషియాలోని బాలిలో ఫ్రెండ్స్ తో కలిసి టూర్ ఎంజాయ్ చేస్తోంది. అలాగే మయోసిటిస్ కు చికిత్స కూడా తీసుకోనుందని టాక్. అందుకోసం అమెరికా వెళ్లనుందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే ట్రీట్ మెంట్ కోసం ఏమో గానీ త్వరలో సమంత నిజంగానే అమెరికా వెళ్లనుంది. అక్కడి నుంచి ఆమెకు అరుదైన ఆహ్వానం అందింది.

బన్నీ తర్వాత: భారత స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day 2023) సందర్భంగా ప్రతి ఏడాది న్యూయార్క్ లో నిర్వహించే వరల్డ్ లార్జెస్ట్ డే పరేడ్ లో (World Largest Parade New York) పాల్గొనేందుకు సమంతకు ఆహ్వానం అందింది (Indian Independence Day Parade). ఇలాంటి అరుదైన గౌరవం గతేడాది ఐకాన్ అల్లు అర్జున్ కు దక్కింది. అప్పటి నుంచి ఈ వేడుకలు వెలుగులోకి వచ్చాయి.

Samantha

అప్పుడే ప్రారంభం: న్యూయార్క్ వరల్డ్ లార్జెస్ట్ డే పరేడ్ వేడుకలు ఆగస్ట్ 20 నుంచి నిర్వహించనున్నారు. ఇందుకోసం సమంత ఈ నెల 18 లేదా 19న న్యూయార్క్ వెళ్లనుందని సన్నిహిత వర్గాల నుంచి వచ్చిన సమాచారం. సమంతతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నటుడు రవి కిషన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఆహ్వానం వచ్చింది. ఇదివరకు సినీ పరిశ్రమ నుంచి అభిషేక్ బచ్చన్, తమన్నా, సన్నీ డియోల్, రవీనా టాండన్, అర్జున్ రాంపాల్, రానా దగ్గుబాటికి ఈ అరుదైన గౌరవం దక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X