Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
తమన్నాకు పదిహేనేళ్లు.. సమంత ఇంట్రెస్టింగ్ ట్వీట్
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి, ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా సక్సెస్ రుచి చూసింది. అయితే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నది మాత్రం తమిళ, తెలుగు భాషల్లోనే. పాల సుందరిగా పేరుగాంచిన తమన్నా.. నటిగా దశాబ్దానికిపైగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉంది. అయితే నటిగా తమన్నాకు పదిహేనెళ్లు నిండబోతోన్నాయి. దీనికి సంబంధించిన సెలెబ్రేషన్స్‌లో భాగంగా సమంత ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేస్తూ.. కామన్ డీపీని రిలీజ్ చేసింది.
ఈ మధ్య సెలెబ్రిటీల పుట్టిన రోజుల వచ్చినా.. ఇలాంటి ప్రత్యేక సందర్భాలు వచ్చినా కామన్ డీపీలు పెట్టి తెగ హల్చల్ చేసేస్తుంటారు. మొన్న రానాకు పదేళ్లు, ఆపై సమంతకు పదేళ్లు అంటూ సోషల్ మీడియాలో హంగామా చేశారు. ఆ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక తమన్నా కూడా నటిగా పదిహేనేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఓ కామన్ డీపీని క్రియేట్ చేశారు. దాన్ని సమంత రిలీజ్ చేసింది.

2005లో పదిహేనేళ్ల ప్రాయంలో సినీ కెరీర్‌ను మొదలు పెట్టింది తమన్నా. బాలీవుడ్ చిత్రం చాంద్ సే రోషనన్ చెహ్రా అనే బాలీవుడ్ చిత్రంతో తెరంగేట్రం చేయగా.. తెలుగులో శ్రీ (2005), తమిళంలో కేడీ(2006) అనే చిత్రం ఎంట్రీ ఇచ్చింది. తమన్నా కష్టపడేతత్త్వం, జెన్యూనిటీ అన్ని తనకు తెలుసు.. తెరపై అలా వెలిగిపోతూ ఉంటుంది.. ఆమెను చూస్తే కళ్లు తిప్పుకోలేరు.. కంగ్రాట్యులేషన్ డార్లింగ్ అంటూ కామన్ డీపీని రిలీజ్ చేసింది.
15 glorious years ... one of the most beautiful faces ❤️..I know @tamannaahspeaks to be amongst the most hardworking and genuine .. she’s a firecracker on screen and you just can’t take your eyes off of her ... congratulations darling .. here is the common dp #15YearsOfTAMANNAAH pic.twitter.com/018zZEoCjX
— Samantha Akkineni (@Samanthaprabhu2) March 3, 2020