Samantha Remuneration అంత సీన్ లేదా? కోట్లలో కాదంట.. పుష్ప పారితోషికం ఎంతంటే?
అక్కినేని వారసుడు నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత కొత్త జీవితాన్ని ఘనంగా ప్రారంభించింది. కొత్త సినిమాలను అంగీకరిస్తూ భారీ రేంజ్‌లో కెరీర్ ప్లాన్ చేసుకొంటున్నట్టు కనిపిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ తర్వాత కొద్దికాలంగా గ్యాప్ తీసుకొన్న సమంత వరుసగా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో పుష్ప సినిమాలో స్పెషల్ పాటను అంగీకరించడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. అయితే పుష్ప సినిమాలో స్పెషల్ పాటకు తీసుకొన్న రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. సమంత రెమ్యునరేషన్ విషయాల్లోకి వెళితే...

సమంత తొలిసారి స్పెషల్ సాంగ్‌తో
సమంత కెరీర్‌ను పరిశీలిస్తే.. గత దశాబ్దకాలంలో ఎన్నడూ ఐటమ్ నంబర్స్ గానీ, స్సెషల్ పాటల్లో నటించిన సందర్భాలు లేవు. కానీ పుష్పలో స్పెషల్ పాటలో నటిస్తున్నారనే విషయం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విడాకుల తర్వాత సమంత నటిగా పలు కోణాల్లో విజృంభించబోతున్నారా అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

పుష్ప మూవీ కోసం భారీ రెమ్యునరేషన్
అయితే పుష్పలో ఐటెం నంబర్‌లో చేస్తున్నందుకు భారీగా రెమ్యునరేషన్ అందుకొన్నట్టు వార్తలు వచ్చాయి. ఆమెకు స్పెషల్ పాటలో నటించినందుకు గాను సుమారు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయలు ముట్టజెప్పినట్టు వార్తా కథనాలు వెలుగు చూశాయి. అయితే ఆ రేంజ్‌లో పారితోషికం అందుకోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

2 కోట్లు ఇవ్వలేదంటూ
అయితే సమంత రెమ్యునరేషన్ గురించి మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సమంతకు 2 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వలేదు. అదంతా కేవలం పీఆర్ స్ట్రాటజీ. మీడియా చేసిన హైప్ మాత్రమే అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సమంత పారితోషికం అంతే అంటూ..
పుష్ప సినిమాలోని పాటలో నటించినందుకు లక్షల్లో మాత్రమే చెల్లించారు. సుమారు 30 నుంచి 40 లక్షలు అందజేశారు అనే విషయంపై చర్చ జరుగుతున్నది. అయితే ఇండస్ట్రీలో ఆమెకు డిమాండ్ ఉందనే పరోక్షంగా చెప్పడానికి రెమ్యునరేషన్‌ను పెంచేసి కథనాలు వెల్లడించారనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏదీ ఏమైనా సమంతకు ఎంత ఇచ్చారు? ఆమె ఎంత తీసుకొన్నదనే విషయం యూనిట్ గానీ, సమంత గానీ వెల్లడిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Recommended Video

సమంత సినిమా కెరీర్ ఇలా..
ఇక సమంత సినీ కెరీర్ విషయానికి వస్తే.. ది ఫ్యామిలీ మ్యాన్‌తో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్న సమంత.. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో నటించింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. అంతేకాకుండా శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే తమిళంలో నయనతార నటించే చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











