ప్రేమ గురించి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు.. కొని తెచ్చుకోవాలని అనుకోవడం లేదు అంటూ!

అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ప్రతి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆమె విడాకుల బాధ నుంచి బయటపడేందుకు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అభిమానులతో కొన్ని ముచ్చట్లు పంచుకున్న ఆమె ప్రేమ గురించి ద్వేషం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

పుట్టిన రోజునే

పుట్టిన రోజునే

ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయమైన సమంత ఆ తర్వాత నాగచైతన్య వివాహమాడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న క్రమంలో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న పలు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ సైతం ఆమె పుట్టిన రోజునే విడుదల అయ్యాయి.

సోషల్ మీడియా వేదికగా

సోషల్ మీడియా వేదికగా

ఇక తాజాగా 35వ వసంతంలోకి అడుగుపెట్టిన సమంత అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ''నాకు విషెస్ చెప్పిన వాళ్ళకి థాంక్స్'' అంటూ పేర్కొన్న సమంత పుట్టిన రోజున తనపై ప్రేమను చూపిన అభిమానులకు ధన్యవాదాలు అని అన్నారు. ఫ్యాన్స్ ప్రేరణ, ప్రోత్సాహం, సానుకూలతలకు తాను ఎప్పటికీ కృతజ్ఞురాలిగా ఉంటానని ఆమె సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

చాలా సమయం పట్టిందని

చాలా సమయం పట్టిందని

అంతేకాక అభిమానులను తాను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నానని , 2022 సంవత్సరాన్ని మరింత ధైర్యంగా ఎదుర్కోవడానికి చాలా ఉత్సాహాన్ని నింపారని నటించిన తెలిపారు. సమంతా చాలా కాలం క్రితం వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డానని, చైతన్యతో విడాకుల సమయంలో మానసికంగా చాలా అలసి పోయనాని గతంలో వెల్లడించింది. దాని నుండి బయటకు రావడానికి తనకు చాలా సమయం పట్టిందని ఆమె వెల్లడించింది.

భిన్నమైన దృక్కోణం

భిన్నమైన దృక్కోణం

ఇక తన తాజా సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో, సమంతా తనకు అందుతున్న ప్రేమ -ద్వేషం మీద స్పందించింది. ఆమె "నేను ప్రేమను లేదా ద్వేషాన్ని కొని తెచ్చుకోవాలని అనుకోవడం లేదు. అన్నింటికీ దూరంగా ఉండండి అని ఆమె చెప్పుకొచ్చింది. "మీరు మీ శత్రువు హృదయంలోకి చూసినట్లయితే, మీ స్వంత హృదయంలో ఉన్న దానికంటే భిన్నంగా ఏమి కనుగొంటారు?" అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. సమంతా "ఒక భిన్నమైన దృక్కోణం!!" అని చెప్పుకొచ్చింది.

స్పీడ్ పెంచి

స్పీడ్ పెంచి

ఇక ప్రస్తుతం సమంత కెరీర్ విషయంలో స్పీడ్ పెంచారన్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన తమిళ సినిమా కాతు వాకుల రెండు కాదల్ సినిమా ఆమె పుట్టిన రోజునే తెలుగు తమిళ భాషలలో విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది.

ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉండగా యశోద సినిమా షూట్ దశలో ఉంది. ఇక మరోపక్క విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. చాలా కాలం తరువాత ఆమె ఒక లవ్ స్టోరీలో నటిస్తోంది. ఇక ఆమె మరో ఇంటర్నేషనల్ సినిమా కూడా ఒప్పుకున్నా సంగతి తెల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X