చైతు నాకు కొన్ని కండిషన్స్ పెట్టాడు.. సమంత!
స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. నాగ చైతన్య కూడా సోషల్ మీడియాలో ఉంటాడు కానీ అంత యాక్టివ్ గా ఉండదు. సమంత అన్ని విషయాలని అభిమానులతో పంచుకుంటుంది. తన ఎదుగుదలకు సోషల్ మీడియా ఎంతగానే ఉపయోగపడిందని సమంత చేబోతోంది. మనుషుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి.. నేను ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి అనే విషయాలు తనకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని సమంత తెలిపింది.
నచ్చని వ్యక్తులని పక్కన పెట్టె అవకాశం సోషల్ మీడియాలో ఉంది. కానీ ఈ విషయంలో నాగ చైతన్య నాలా ఆలోచించడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు అని సమంత అంటోంది. తన ఫోటోలు, ఇతర విషయాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని చైతు నాకు కండిషన్ పెట్టాడు. సోషల్ మీడియా విషయంలో చైతు రూల్స్ కఠినంగా ఉంటాయి.

చైతు ఆలా ఉండడం తనకు కూడా అలవాటైపోయింది భర్త గురించి తెలిపింది. ఈ కపుల్స్ ఇద్దరూ మజిలీ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ అంశాలతో దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











